రాజంపేట అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అభ్యర్థిని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో రాజంపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో చర్చించారు. నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారు. కడప జిల్లాలో టిక్కెట్ల పరంగా స్పష్టత ఇచ్చే క్రమంలో ఆ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. పార్టీ అధినేతతో సమావేశానికి కడప, రాజంపేట పార్లమెంటరీ […]

రాజంపేట అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
Follow us

|

Updated on: Feb 21, 2019 | 4:33 PM

అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అభ్యర్థిని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో రాజంపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో చర్చించారు. నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నేతలకు సీఎం నచ్చజెప్పారు.

కడప జిల్లాలో టిక్కెట్ల పరంగా స్పష్టత ఇచ్చే క్రమంలో ఆ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. పార్టీ అధినేతతో సమావేశానికి కడప, రాజంపేట పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్యనేతలు  అమరావతి చేరుకున్నారు.