Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

తిరుమలేశుని సన్నిధిలో అద్భుత దృశ్యం.. చూసితీరాల్సిందే !

తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో బుధవారం తెలతెలవారుతుండగానే అద్భత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సప్తగిరులు ఎక్కుతున్న భక్త జనం ఈ దృశ్యాలను చూసి పరవశించిపోయారు. సహజంగానే వర్షాకాలంలోను, శీతాకాలంలోను తిరుమల కొండలు చూడచక్కని ప్రకృతి రమణీయతను సంతరించుకుని వుంటాయి. పచ్చని కొండల మధ్య సాగే హిల్ రూట్ జర్నీ ఆనంద పరవశులను చేస్తుంది. తిరుమల గిరులను మరింత అందంగా మారుస్తూ బుధవారం ఉదయం ఆవిష్కృతమైన దృశ్యం ప్రయాణీకులను ఆగి మరీ చూసి, తరించేలా చేసింది.

గత వారం రోజులుగా తరచూ కురుస్తున్న వర్షాలు బుధవారం సుందర దృశ్య ఆవిష్కరణకు కారణమయ్యాయి. ఏడు కొండల చుట్టూ ప్రకృతి రమణీయతను పెంచాయి. పచ్చని చెట్లు, మంచు పొరలతో మరింత సుందరంగా మారిన తిరుమలేశుని సన్నిధి సినిమాల్లోని గ్రాఫిక్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపించాయి. మరీ ముఖ్యంగా రెండో ఘాట్ రైట్‌లో చేతిని తాకుతూ వెళ్లిన తెల్లని మేఘాలను అందుకోవాలని చూసిన ప్రతీ ఒక్కరు తహతహలాడిన పరిస్థితి.

ధవళవర్ణంలో చేతికి అందే లెవెల్‌లో, మోమును తాకేంతటి దగ్గరలో వెళుతున్న మేఘాలు ప్రతీ ఒక్కరిని ప్రకృతి ఒడిలోకి తీసుకు వెళ్ళాయంటే అతిశయోక్తి కాదు. పాల నురగలా దట్టంగా కనిపిస్తూ.. శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులు దారిలోనే విశ్రమించి ఆస్వాదించేలా చేశాయి.