వాతావ‌ర‌ణ మార్పుల‌వ‌ల్లే.. దేశంలో పిడుగుల బీభత్సం..

పిడుగు అంటే ఆకాశంలో సహజంగా ఉత్పన్నమైన విద్యుత్పాతం. ‌వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగానే దేశంలో పిడుగులు బీభ‌త్సం సృష్టిస్తున్నాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. రానున్న 48 గంట‌ల్లో దేశంలో

వాతావ‌ర‌ణ మార్పుల‌వ‌ల్లే.. దేశంలో పిడుగుల బీభత్సం..
lightning strikes
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 11:46 PM

పిడుగు అంటే ఆకాశంలో సహజంగా ఉత్పన్నమైన విద్యుత్పాతం. ‌వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగానే దేశంలో పిడుగులు బీభ‌త్సం సృష్టిస్తున్నాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. రానున్న 48 గంట‌ల్లో దేశంలో మ‌రిన్ని పిడుగులు ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) హెచ్చ‌రించింది. ప్ర‌తి ఏడాది జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దేశంలో పిడుగులు ప‌డ‌టం సాధార‌ణ విష‌యమే అయినా.. ఈ సారి పిడుగుపాట్లు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని ఐఎండీ అధికారులు తెలిపారు.

బీహార్‌లో గ‌త 10 రోజుల వ్య‌వ‌ధిలోనే పిడుగుల వల్ల 147 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త మార్చి నుంచి చూస్తే.. రైతులు, రైతు కూలీలు, ప‌శువుల కాప‌రులు క‌లిపి మొత్తం 215 మంది బీహారీల‌ను పిడుగులు బ‌లిగొన్నాయ‌ని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇదిలావుంటే వాతావ‌ర‌ణ మార్పుల‌వ‌ల్ల రానున్న రోజుల్లో బీహార్‌లో ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

వాతావ‌ర‌ణ మార్పులవ‌ల్ల ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరుగుతున్నాయ‌ని, ఆ అధిక ఉష్ణోగ్ర‌తల కార‌ణంగా వానా‌కాలంలో పిడుగులు ప‌డుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెప్పిన‌ట్లు బీహార్ విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి ల‌క్ష్మేశ్వ‌ర్ రాయ్ చెప్పారు. గ‌త ఐదేళ్లలో ఏ ఒక్క వానాకాలం కూడా బీహార్‌లో 200కు మించి మ‌ర‌ణాలు న‌మోదు కాలేద‌ని, ఈసారి మాత్రం వానాకాలం ప్రారంభంలోనే 215 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని అధికారులు చెప్పారు.

Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..