మాస్కులతో మట్టి గణపతి.. శానిటైజర్, పీపీఈ కిట్టుతో కొత్తగా

కరోనా దెబ్బతో ఇళ్లలోనే చాలామంది వినాయకుడిని ప్రతిష్టించారు. ఇక కొంతమంది మట్టి, పసుపు, వివిధ రకాల వస్తువులతో గణపతిని స్వయంగా వారే తయారు చేసుకుంటున్నారు. కానీ విశాఖలో ఓ యువకుడు మాత్రం మాస్క్‌లతో వినాయకుడిని తయారుచేశాడు. మట్టి గణపతికి 300 మాస్క్‌లు..

మాస్కులతో మట్టి గణపతి.. శానిటైజర్, పీపీఈ కిట్టుతో కొత్తగా
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 5:36 PM

కరోనా దెబ్బతో ఇళ్లలోనే చాలామంది వినాయకుడిని ప్రతిష్టించారు. ఇక కొంతమంది మట్టి, పసుపు, వివిధ రకాల వస్తువులతో గణపతిని స్వయంగా వారే తయారు చేసుకుంటున్నారు. కానీ విశాఖలో ఓ యువకుడు మాత్రం మాస్క్‌లతో వినాయకుడిని తయారుచేశాడు. మట్టి గణపతికి 300 మాస్క్‌లు వేశాడు. ముఖానికి ఫేస్‌ షీల్డ్‌ పెట్టాడు. చేతిలో ఆయుధాలకు బదులుగా శానిటైజర్‌ పెట్టాడు. ఇక వినాయకుడి వాహనమైన ఎలుకకు PPE కిట్‌ తొడిగాడు.

టీవీ9 ఇచ్చిన స్ఫూర్తితో ఏటా మట్టి గణేషుడిని పెట్టేవాడు హరిప్రసాద్‌ అనే యువకుడు. ఈసారి మాత్రం కరోనా కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. ”మాస్క్‌ ధరించండి… స్టే హోమ్‌… స్టే సేఫ్‌” అంటూ ప్లకార్డులు కూడా పెట్టాడు. అలాగే గణపతిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఓ మాస్క్‌ను అందజేస్తున్నాడు. ఇళ్లలోనే వినాయకచవితి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తన ఇంట్లోని దుకాణంలోనే విగ్రహాన్ని ప్రతిష్టించాడు హరిప్రసాద్‌.

Read More:

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు