Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

జబర్దస్త్‌లో చీలిక..! అసలేం జరుగుతోంది..? ఎంత మంది జంప్..?

Clashes in Jabardasth program team: How many artists are leaving the show?, జబర్దస్త్‌లో చీలిక..! అసలేం జరుగుతోంది..? ఎంత మంది జంప్..?

ఇన్నాళ్లూ.. ఈటీవీలో ‘జబర్దస్త్‌’ షో ద్వారా ఎంతో పేరు గడించిన టీమ్‌.. తమ అడ్డాను జీ టీవీకి మార్చేశారా? జబర్దస్త్ టీమ్‌ ఇప్పుడు జీ తెలుగులో ‘లోకల్‌ గ్యాంగ్స్’ పేరుతో సందడి చేయబోతోందా? జబర్దస్త్ ఏడేళ్ల ప్రస్థానంలో ఎందరో కమెడియన్స్‌ను బుల్లితెర, వెండితెరలకు పరిచయం చేసింది. మరి రాబోయే రోజుల్లో జబర్దస్త్‌, లోకల్‌ గ్యాంగ్స్‌‌ల మధ్య వార్‌ జరగబోయే పరిస్థితులు నెలకొన్నాయా..?

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్దగా సక్సెస్ అయిన షోల్లో.. ‘జబర్దస్త్’ కామెడీ షో ఒకటి. ఈ షో.. కోట్ల మందిని ఎంతలా అలరించిందో.. తెలిసిన విషయమే. గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలు అయ్యిందంటే.. ఇంటిల్లిపాదీ.. ఈటీవీ ముందు కూర్చోని నవ్వులు చిందిస్తూంటారు. ఎన్ని షోలు వచ్చినా.. టాప్ రేటింగ్‌తో ఈ షో దూసుకెళ్లిందనే చెప్పాలి. జబర్దస్త్ వల్ల చాలా మంది కమేడియన్స్‌కి అతి తక్కువ కాలంలోనే.. మంచి ఫేమ్ సంపాదించి.. సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నారు. పెద్దవారి నుంచి చిన్నవారి దాకా.. అందరూ ఈ షో ద్వారా సెలబ్రిటీలుగా మారినవారే.

అలాంటి షోకి ఇప్పుడు ఏమైంది..? జబర్దస్త్‌లో చీలికలు రావడానికి కారణాలేంటి..? ఇక జబర్దస్త్ యుగం ముగిసిపోనుందా..? అంటే అవుననే సమాధానాలు చెబుతున్నాయి.. తాజా పరిణామాలు. జబర్దస్త్‌లో.. నాగబాబు నవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నవ్వుల నవాబ్‌గా ఆయనకి పేరు కూడా వచ్చింది. అందులోనూ.. స్కిట్‌ల మధ్యలో నాగబాబు వేసే పంచ్‌లకి జనాలు బాగా కనెక్టయ్యారు. అంతేకాకుండా.. ఈ షోకి అంత సీనియర్ యాక్టర్‌ని జడ్జ్‌గా తీసుకురావడం చాలా పెద్దపని. అయితే.. ఆయన ఇంత పాపులర్ షోను విడిచి వెళ్తున్నారా..? అన్న ప్రశ్న అందరినీ.. తొలిచివేస్తోన్న ప్రశ్న.

‘జబర్దస్త్’ను ఇంతకాలం నితిన్-భరత్‌లు డైరెక్ట్ చేశారు. తాజాగా ఆర్గనైజింగ్ సంస్థతో విభేదాలు రావడంతో వారు తప్పుకున్నారు. సదరు డైరెక్టర్లతో మంచి సాన్నిహిత్యం ఉన్న నాగబాబు.. హర్ట్ అయ్యి వెళ్లిపోయారని టాక్ వినిపిస్తోంది. అలాగే.. యాంకర్ అనసూయకి కూడా.. జడ్జ్‌గా మంచి ఆఫర్ రావడంతో.. లోకల్ గ్యాంగ్‌ షోకి వెళ్లిపోయింది. ఇక చమ్మక్ చంద్ర కూడా నాగబాబు బాటలోనే పయనిస్తున్నట్టు సమాచారం.

అయితే.. మరి రోజా కూడా ఈ షో నుంచి తప్పుకుంటున్నారా..? అనే ప్రశ్న తలెత్తిన నేపధ్యంలో.. ఆమె మాత్రం జబర్దస్త్‌లోనే కొనసాగాలనుకుంటున్నారని సమాచారం. అలాగే.. అనసూయ లేదు కాబట్టి.. రష్మీ కూడా.. జబర్దస్త్‌లోనే రెండు పార్ట్‌లనూ చేస్తుందట. ఇక.. ఈ షోలో.. ముఖ్యమైనవారు సుధీర్, శ్రీను, హైపర్ ఆది, చంటి, అవినాష్, కార్తిక్‌, రాకేష్‌లలో.. హైపర్‌ ఆది కూడా.. నాగబాబు వైపే మొగ్గు చూపుతున్నాడని తాజా సమాచారం. చూడాలి మరి.. జబర్దస్త్ ఏమౌతుందో..! ఇన్నాళ్లూ.. అందరికీ.. నవ్వులు పంచిన ఈ షో.. బోసిపోతుందా..! ఏది ఏమైనా ఈ కామెడీ కార్యక్రమాలు వీక్షించే ప్రేక్షకులను.. ఈ తాజా పరిణామాలు.. కాస్త షాక్‌కు గురి చేస్తాయనడంలో సందేహం లేదు.