Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

పంతం నెగ్గించుకున్న ఆదినారాయణరెడ్డి ..నెక్ట్స్ టార్గెట్ అతడేనా..?

Adinarayana Reddy joins BJP, పంతం నెగ్గించుకున్న ఆదినారాయణరెడ్డి ..నెక్ట్స్ టార్గెట్ అతడేనా..?

2014లో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చకండువా కప్పుకుని మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి…ఇప్పుడు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో ఆది ఎంట్రీకి ఫస్ట్‌లో బ్రేక్‌లు పడ్డాయి. మూడు నెలల కిందట పార్టీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అయ్యారు. విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పిలుపు వస్తే బీజేపీలో చేరదామని అనుకున్నారు. కానీ ఒక్క ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో అప్పట్లో ఆయన చేరిక ఆగిపోయింది.

అప్పట్లో టీడీపీలోకి ఆదిని ఎంట్రీని అడ్డుకున్న సీఎం రమేష్..ఇప్పుడు బీజేపీలో తన ఎంట్రీకి అడ్డుపుల్లు వేశారని ఆది నారాయణరెడ్డి డౌట్‌. ఇంతకుముందే బీజేపీలో చేరిన సీఎం రమేష్ అదే పార్టీలోకి తనను రానివ్వకుండా హైకమాండ్‌ దగ్గర అడ్డుకున్నారట. అయితే ఇప్పుడు ఆది కూడా బీజేపీలో చేరారు. దీంతో ఈ ఇద్దరి మధ్య పాత వైరాలు మళ్లీ పురివిప్పటం ఖాయం అంటున్నారు. కడపగడపలో ఆధిపత్యపోరు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇప్పటికే సీఎం రమేష్‌ టార్గెట్‌గా ఆది బ్యాచ్‌ విమర్శలు మొదలుపెట్టింది. ప్రొద్దుటూరు వరదరాజులరెడ్డితో రమేష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్నటికినిన్న తన స్వగ్రామం పోట్లదుర్తి నుంచి గాంధీ సంకల్పయాత్ర చేపట్టిన సీఎం రమేష్ పై వరద విరుచుకుపడడం వెనుక ఆది హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరికను అడ్డుకున్న సీఎం రమేష్‌పై రాబోయే రోజుల్లో ఆది ఇంకా విమర్శల దాడి పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇటు ఆది బీజేపీలో చేరే టైమ్‌లో ఎంపీ జీవిఎల్‌ మాత్రమే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఎవరూ లేరు. ప్రస్టేజ్ ఇష్యూ కావడంతో ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పి ఆది బీజేపీలో చేరారని తెలుస్తోంది. ఆయన చేరికతో మొత్తానికి కడపగడపలో ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమైందనేది జిల్లా వాసుల మాట.