ఇక రేషన్ షాపులే.. మినీ “మీ” సేవ సెంటర్లు

Civil Supplies Dept extend T-Wallet services to entire Telangana FP shops, ఇక రేషన్ షాపులే.. మినీ  “మీ” సేవ సెంటర్లు

రేషన్ దుకాణాలు ఇకపై మీ సేవ సెంటర్‌లుగా మారిపోనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే టీ వ్యాలెట్ ద్వారా నెలనెలా తీసుకునే సరుకులతోపాటు పలు సేవలు కూడా లభించేలా చర్యలు తీసుకుంటుంది. కరెంటు బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను, నగదు బదిలీ, మొబైల్ రీచార్జి తదితర సేవలు అందించేందుకు టీ- వాలెట్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రతినెల ఒకటో తేదీనుంచి 15వ తేదీ వరకు పౌర సరఫరాలశాఖ నుంచి పొందే సరుకులను పొందుతున్నారు. ఇప్పటికే ఈ పాస్ ద్వారా బయోమెట్రిక్ విధానంతో రేషన్ కార్డులో నమోదైన కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు ఈ సరుకుల్ని తీసుకుంటున్నారు. అయితే రాబోయే కొత్త విధానం ద్వారా రేషన్ కార్డు ఒక ప్రాంతంలో ఉండి.. ఉపాధికోసం మరో ప్రాంతానికి వెళ్లినప్పటికీ అక్కడే సరుకులు తీసుకునే వీలును కల్పించనున్నారు. దీనివల్ల లబ్దిదారులు ఎంతో ఉపశమనం పొందనున్నారు. పైగా రేషన్ తీసుకోని పక్షంలో కార్డు రద్దవుతుందనే బెంగ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే రేషన్ దుకాణం అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా సరుకులు తీసుకునే అవకాశం వినియోగ దారులకు కలుగుతుంది.

టీ వ్యాలెట్ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి అందించే సేవలపై డీలర్లకు తగిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రతి నెల 15రోజులపాటు ఇచ్చే రేషన్‌తో పాటు యుటిలిటీ బిల్లుల పేమెంట్స్ కూడా జరిపేందుకు వీలుగా నెల రోజులు మొత్తం దుకాణాన్ని తెరిచి ఉంచేలా టీ వ్యాలెట్ సిద్దం చేస్తున్నారు. ఇక టీ వ్యాలెట్‌పై శిక్షణ పొందిన రేషన్ డీలర్లు అక్టోబర్ నెలనుంచి రేషన్ సరుకులతో పాటు పలు సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *