రేపటి నుంచి యుపిఎస్‌సి మెయిన్స్‌

The marks obtained in the Civil Services main exam will be counted in the final merit list., రేపటి నుంచి యుపిఎస్‌సి మెయిన్స్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) సివిల్‌ సర్వీసులకు నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలు రేపటి (సెప్టెంబరు 20) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 29వ తేదీ వరకూ జరుగుతాయి. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు.11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూన్ 2న దేశవ్యాప్తంగా మొత్తం 72 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *