హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు.. ఏడుగురిపై సీఐడీ కేసులు

ఏపీలో హైకోర్టు, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతోంది. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు.. ఏడుగురిపై సీఐడీ కేసులు
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 7:20 AM

ఏపీలో హైకోర్టు, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతోంది. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. దీంతో హైకోర్టుతో పాటు పలువురు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. వీరు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అందులో దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం ఉన్నారు. వీరిపై ఐటీ యాక్ట్ సెక్షన్‌ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా మరోవైపు హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 49 మందికి మంగళవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: విషాదం.. బోరు బావిలో పడిన బాలుడు మృతి..!