కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేతకు సీఐడీ నోటీసు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేతకు ఏపీ సీఐడీ అధికారులు నోటుసులు జారీ చేశారు. తన వ్యాఖ్యలకు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది.

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేతకు సీఐడీ నోటీసు
Follow us

|

Updated on: Aug 30, 2020 | 11:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేతకు ఏపీ సీఐడీ అధికారులు నోటుసులు జారీ చేశారు. తన వ్యాఖ్యలకు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం విదితమే. ప్రతినిత్యం వేలాది కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. అయితే, కరోనా అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఓ ఛానల్‌కు ఫోనో ఇచ్చినందుకు పీసీసీ ఉపాధ్యక్షులు డా. గంగాధర్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఆదివారం ఉదయం సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంకు వెళ్లిన గంగాధర్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతతో పాటు ఇద్దరు న్యాయవాదులను కూడా సీఐడీ కార్యాలయం లోపలికి అనుమితచ్చింది. కాగా, గంగాధర్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతకు నోటీసు పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.