Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

చైనాపై అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డేగ క‌న్ను..!

CIA has spent months telling the White House China's coronavirus totals are based on lies, చైనాపై అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డేగ క‌న్ను..!

అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ చైనాపై దృష్టి పెట్టింది. కరోనా తీవ్రతను దాచిపెట్టిందన్న అనుమానంతో వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. కరోనా కారణంగా అమెరికా అల్లకల్లోలం అవుతోంది. రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసింది. అమెరికా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. దీంతో దీని కథ తేల్చేందుకు సీఐఏ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది అమెరికా. చైనా చెబుతున్నట్టు నిజంగానే అక్కడ కరోనా వెంటనే అదుపులోకి వచ్చిందా లేక వాస్తవాలు దాచిపెట్టారా అన్న కోణంలో సీక్రెట్‌ ఆపరేషన్ మొదలయ్యినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చైనాలో కరోనా బాధితుల విషయంలో నిజాలను బయటకు చెప్పకుండా తక్కువ చేసి చూపించిందన్న అనుమానం అమెరికాకు మొదటి నుంచి ఉంది. అమెరికాలోనే ఇంత తీవ్రంగా ఉంటే చైనాలో ఇంకా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తోంది అగ్రరాజ్యం. దీంతో త్వరలోనే వాస్తవాలు బయటపెడతామంటున్నాయి అమెరికా దర్యాప్తు సంస్థలు. అటు ఊహాన్‌లోనూ పరిస్థితులపై కొన్ని కథనాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వేలాది మంది మాయమయ్యారని, కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నట్టు ఫోటోలతో కూడిన కథనాలు కొన్ని వెలువడ్డాయి. వీరంతా ఏమై ఉంటారన్నది అమెరికా దర్యాప్తు సంస్థల సందేహం. బాధితుల సంఖ్యను చైనా చాలా తక్కువ చేసి చూపించిందనడానికి ఇదే నిదర్శనమంటున్నాయి అమెరికా పత్రికలు.

Related Tags