Church attack: ఉగ్రవాదుల ఘాతుకం.. చర్చిపై దాడి.. 24మంది మృతి!

Church attack: ఉత్తర బుర్కినా ఫాసోలోని ఒక గ్రామంలో ప్రొటెస్టంట్ చర్చిపై జరిగిన దాడిలో 24 మంది మృతి చెందగా, 18 మంది గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం. నార్త్‌ బూర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ప్రాంతీయ గవర్నర్‌ వెల్లడించారు. ఓ సాయుధ ఉగ్రవాదుల సమూహం యఘా ప్రావిన్స్‌లోని పాన్సీలోకి ప్రవేశించిందనీ.. అక్కడి జనంపై దాడులకు తెగబడిందని తెలిపారు. ఈ ఘటనలో పాస్టర్‌తో పాటు […]

Church attack: ఉగ్రవాదుల ఘాతుకం.. చర్చిపై దాడి.. 24మంది మృతి!
Follow us

| Edited By:

Updated on: Feb 17, 2020 | 6:47 PM

Church attack: ఉత్తర బుర్కినా ఫాసోలోని ఒక గ్రామంలో ప్రొటెస్టంట్ చర్చిపై జరిగిన దాడిలో 24 మంది మృతి చెందగా, 18 మంది గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం. నార్త్‌ బూర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ప్రాంతీయ గవర్నర్‌ వెల్లడించారు. ఓ సాయుధ ఉగ్రవాదుల సమూహం యఘా ప్రావిన్స్‌లోని పాన్సీలోకి ప్రవేశించిందనీ.. అక్కడి జనంపై దాడులకు తెగబడిందని తెలిపారు. ఈ ఘటనలో పాస్టర్‌తో పాటు 24 మంది మృతిచెందారనీ.. 18 మంది గాయాపడ్డారని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కొందరిని అపహరించి తమ వెంట తీసుకెళ్లారని తెలిపారు.

ఈ సంఘటన ఆదివారం సేవ సందర్భంగా జరిగిందని భద్రతా అధికారులు తెలిపారు. బుర్కినాఫాసో జిహాదీ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారింది. ఈ ముష్కరుల దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 750 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.. 6లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న అనుమానిత జిహాదీలు సెబ్బాలో ఏడుగురిని ఓ పాస్టర్‌ ఇంట్లో నిర్బంధించారు. ఆ తర్వాత మూడు రోజులకు పాస్టర్‌తో పాటు ఐదు మృతదేహాలను ఆ ఇంట్లో గుర్తించినట్టు గవర్నర్‌ తెలిపారు. ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్‌ దేశాల్లో కలిపి గతేడాది దాదాపు 4వేల మంది జిహాదీల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.