Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా వ్యవహరించనున్న ప్రభుత్వం. రైతులకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • కాకినాడ: కరోన పరీక్షల్లో నిర్లక్ష్యం. కరోనా వైద్య పరీక్షలు విషయంలో బట్టబయలు అవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్న సిబ్బంది. కరోనా ల్యాబ్ నుండి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్ గా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్ పూర్ లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే మధ్యాహ్నం సమాచారం ఇచ్చిన పోలీసులు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.
  • శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ - జిల్లా కలెక్టర్ జె నివాస్. తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత. కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి. ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 144వ సెక్షన్ అమలు. ఎక్కడా ప్రజలు గుమిగూడరాదు. ప్రజలు సహకరించాలి.
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం. వచ్చేవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా సులభతర పరిపాలన. ప్రతీశాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడు. రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా. ముద్ర సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటల్ సంతకాల సేకరణ. ఈ ఆఫీస్ పై ఉద్యోగులకు త్వరలో శిక్షణ. ఈ ఆఫీస్ కోసం అధికారుల హైరార్కీ మ్యాపింగ్.

పాక్‌లో మరో దారుణం.. టీనేజ్‌ క్రిస్టియన్‌ అమ్మాయిపై దాడి.. ఆపై..

Christian girl beaten.. suffers nasal fracture in Pakistan's Kasur city, పాక్‌లో మరో దారుణం.. టీనేజ్‌ క్రిస్టియన్‌ అమ్మాయిపై దాడి.. ఆపై..

పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఓ రోజు హిందువులపై జరిగితే.. మరోరోజు సిక్కులపై.. ఆ తర్వాత క్రైస్తవులపై.. ఇలా నిత్యం అక్కడ ఉన్న మైనార్టీలపై పాకిస్థాన్‌లో ఉన్న మెజార్టీ ముస్లింలు నిత్యం దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. మైనార్టీ మైనర్ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి.. ఆపై మతం మార్చి వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్రతి ఏటా దాదాపు వెయ్యి మంది హిందూ మైనార్టీ యువతులను బలవంతంగా కిడ్నాప్‌ చేసి.. మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా.. కసూర్ ప్రాంతంలోని ఓ యుక్త వయస్సులో ఉన్న క్రైస్తవ అమ్మాయిపై స్థానిక గుండాలు దాడికి దిగారు. మీరు తక్కువ జాతికి చెందిన వారు.. ఇక్కడ ఉండేందుకు వీలులేదంటూ బెదిరింపులకు దిగుతున్నారని.. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అక్కడ ఉన్న ఓ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త వీరి పట్ల బాసటగా నిలవడంతో.. కనీసం ఈ విషయం ప్రపంచానికి తెలిసిందని
అక్కడి స్థానికులు వాపోతున్నారు. యువతిపైన దాడికి దిగిన సమయంలో.. ఇంట్లో అంతా మహిళలే ఉన్నారని.. అయితే ఇంటికి సంబంధించిన పురుషులు వచ్చాక.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసినప్పటికీ.. అక్కడ ఎవరూ తమను పట్టించుకోవడం లేదని.. తమ ఇంటి మగ వారిని కొట్టి.. అక్రమ కేసులు పెట్టారని వాపోతున్నారు. పంజాబ్‌, సింధ్ ప్రావిన్స్‌లలో ఉండే.. మైనార్టీలపై ఈ రకమైన దాడులు నిత్యం జరుగుతున్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.

Related Tags