బౌలర్లకు నేనంటే వణుకు: క్రిస్ గేల్

మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనేందుకు అన్ని జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుంటున్నాయి. విజయవంతంగా ఐదోసారి ఈ మెగా టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ కూడా ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. తనకు తానే యూనివర్స్‌ బాస్‌గా ప్రకటించుకున్న క్రిస్‌ గేల్‌.. రానున్న ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు. 2019 మే 30 నుంచి జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తానని తెలిపాడు. ఇంటర్నేషనల్ […]

బౌలర్లకు నేనంటే వణుకు: క్రిస్ గేల్
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 7:23 PM

మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనేందుకు అన్ని జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుంటున్నాయి. విజయవంతంగా ఐదోసారి ఈ మెగా టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ కూడా ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. తనకు తానే యూనివర్స్‌ బాస్‌గా ప్రకటించుకున్న క్రిస్‌ గేల్‌.. రానున్న ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు. 2019 మే 30 నుంచి జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తానని తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ జట్ల బౌలర్లకు తానంటే వెన్నులో వణుకు పుడుతుందని విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గేల్ తెలిపాడు. ప్రత్యర్థులు మీడియాతో గేల్ అంటే తమకు భయం లేదని చెబుతారని, తెర వెనుక మాత్రం గేల్ అంటే కొంచెం భయం ఉంటుందని బౌలర్లు చెబుతారని గేల్ పేర్కొన్నాడు. యునివర్సల్ బాస్‌గా తనను తాను గేల్ ప్రకటించుకున్నాడు. ఈ సారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటామని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.