‘యూనివర్స్ బాస్’ ఖాతాలో మరో రికార్డు

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ వన్డే ప్రపంచకప్‌లో మరో రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో అందరికంటే అత్యధిక సిక్సర్లు(39) బాదిన మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాది ఈ ఘనతను అందుకున్నాడు. క్రిస్ గేల్ తర్వాత రెండో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (37) ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్‌(31), బ్రెండన్‌ మెకల్లమ్‌(29), గిబ్స్‌(28), జయసూర్య, సచిన్‌ టెండూల్కర్‌(27)లు ఉన్నారు. మరోవైపు వరుసగా ఆరు అర్ధ […]

'యూనివర్స్ బాస్' ఖాతాలో మరో రికార్డు
Follow us

|

Updated on: Jun 01, 2019 | 12:07 PM

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ వన్డే ప్రపంచకప్‌లో మరో రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో అందరికంటే అత్యధిక సిక్సర్లు(39) బాదిన మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాది ఈ ఘనతను అందుకున్నాడు.

క్రిస్ గేల్ తర్వాత రెండో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ (37) ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్‌(31), బ్రెండన్‌ మెకల్లమ్‌(29), గిబ్స్‌(28), జయసూర్య, సచిన్‌ టెండూల్కర్‌(27)లు ఉన్నారు.

మరోవైపు వరుసగా ఆరు అర్ధ సెంచరీలు బాదిన ఎనిమిదవ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు క్రిస్ గేల్. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు జావేద్ మియాందాద్ 9 అర్థ సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.