రాహుల్ తో మళ్ళీ బాబు భేటీ..స్ట్రాటజీ రెడీ ?

కేంద్రంలో ఎలాగైనా బీజేపీయేతర ( నాన్-బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసేందుకు ఏపీ సిఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఒకవేళ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ తగ్గినా..సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ పట్టు బట్టిన పక్షంలో.. ప్రతిపక్షాలు ఏం చేయాలన్న దానిపై ఆయన రాహుల్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ […]

రాహుల్ తో మళ్ళీ బాబు భేటీ..స్ట్రాటజీ రెడీ ?
Follow us

|

Updated on: May 19, 2019 | 4:14 PM

కేంద్రంలో ఎలాగైనా బీజేపీయేతర ( నాన్-బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసేందుకు ఏపీ సిఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఒకవేళ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ తగ్గినా..సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ పట్టు బట్టిన పక్షంలో.. ప్రతిపక్షాలు ఏం చేయాలన్న దానిపై ఆయన రాహుల్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యూహాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, దానిపై చర్చించినట్టు చెబుతున్నారు. అన్ని విపక్షాలతో ఓ సంయుక్త కూటమి ఏర్పాటుకు గల అవకాశాలను  చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం.    యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తోను, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ తో కూడా బాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. బాబు తిరిగి పవార్ ను కలుసుకోనున్నారు. (అఖిలేష్ తో బాబు 70 నిముషాలసేపు, మాయావతితో గంటసేపు భేటీ అయిన విషయం గమనార్హం). యూపీఏ చైర్ పర్సన్ సోనియా ను కూడా ఆయన కలుసుకోనున్నారు. అటు-నాన్ కాంగ్రెస్, నాన్- బీజేపీ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణా సిఎం కేసీఆర్ తో చంద్రబాబుకు రాజకీయ ‘ వైరుధ్యం ‘ ఉన్నప్పటికీ.. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీయే కాక… బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ అయినా..ఎన్నికల ఫలితాల అనంతరం మహా కూటమి ఏర్పాటుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..