చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం

చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు.

చిత్తూరు జిల్లాలో 600 నాటు తుపాకుల స్వాధీనం
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2020 | 11:02 AM

చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్న నాటు తుపాకులపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు ఆరువందల నాటు తుపాకులను పోలీసులు గుర్తించారు. చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండానే ముఠాలు యధేచ్ఛగా ఈ నాటు తుపాకులను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్తూరుతో పాటు మదనపల్లె, కేవీపల్లె, కేవీబీపురం, కార్వేటినగరం, బాకరాపేట, పలమనేరు, కుప్పం, ఎర్రావారిపాలెం ప్రాంతాల్లో పోలీసులు నాటు తుపాకులను గుర్తించారు. మరోవైపు పోలీసుల దాడులతో అడవిలో చెట్ల కింద నాటు తుపాకులను దాచేస్తున్నాయి ముఠాలు. ఇక పలమనేరు సమీపంలో నాటు తుపాకుల తయారీ యూనిట్ ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు, దానిపైనా దాడులు చేశారు. కాగా ఇంతపెద్ద ఎత్తున నాటు తుపాకులను పట్టుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

Read This Story Also: షాకిస్తోన్న విజయ్‌ దేవరకొండ కొత్త లుక్.. నెటిజన్ల భిన్న కామెంట్లు!