Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

వర్షితపై అత్యాచారం, హత్య: మృగాడు దొరికాడు..ఎర్ర బూట్లే పట్టించాయి

Varshitha Rape and Murder Case, వర్షితపై అత్యాచారం, హత్య: మృగాడు దొరికాడు..ఎర్ర బూట్లే పట్టించాయి

మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్‌ చేశారు.  చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకోని, క్లీన్ షేవ్ చేయించుకుని పారిపోయాడు.

అభం, శుభం తెలియని..చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు కామాంధుడు. దారుణాతి దారుణంగా 5 ఏళ్ల  పసిపాపను అపహరించి, తీవ్రంగా హింసించి అత్యాచారం చేసి చంపేశాడు కిరాతకుడు. చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి, ముగ్గురు బిడ్డల్లో వర్షితే ఏకైక కుమార్తె. అప్పుడే తమ ముందు ఆడుకుంది. పెళ్లిలో తెగ హడావిడి చేసింది. కానీ అంతలోనే మాయమైంది. చిన్నారిని ఫోటోలు తీసి, ఆటపట్టించి, మాయమాటలు చెప్పి ..అర్థరాత్రి 12 గంటల సమయంలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా..తెల్లారాక శివారు ప్రాతంలో పాప డెడ్ బాడీ లభ్యమైంది. 

పట్టించిన నిందితుడి ఎర్ర బూట్లు:

సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుడి ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో..మొదట ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. కానీ నిందితుడు గెటప్ ఛేంజ్ చేయడంతో..ఎటువంటి క్లూ లభించలేదు. కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో..నిందితుడి ధరించిన ఎర్ర బూట్లపై పోలీసుల దృష్టి పడింది. అప్పటికే చూచాయగా అనుమానితుడ్ని గుర్తించిన పోలీసులు..అతడి భార్యకు సీసీ విజువల్స్ చూయించగా..అక్కడ ఉన్న వ్యక్తి ధరించిన బూట్లు తన భర్తవే అని ఆమె తేల్చేసింది. దీంతో పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టి.. ఛత్తీస్‌గఢ్‌‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దుండగుడు గతంలో కూడా చిన్నారులను లైంగికంగా వేధించినట్టు పోలీసులకు సమాచారం అందింది.