Breaking News
  • కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. కరోనాపై పోరాటంలో ప్రపంచదేశాలన్నీ కూడా భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. భారత్‌లో కరోనా రికవరీ రేటు బాగుందని.. మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపింది.
  • హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ . హేమంత్ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్న అవంతి. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటున్న అవంతి . గతంలో హేమంత్ తండ్రితో బెదిరింపులకు దిగిన సందీప్ రెడ్డి . నాతో రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అంటూ నెల రోజులు క్రితం బెదిరింపులు . హేమంత్ కిడ్నాప్ అయిన రోజు సందీప్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న గచ్చి బౌలి పోలీసులు . సందీప్ రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉందంటున్న అవంతి.
  • చెన్నై : ఎస్పీబీ మెమోరియల్ ఫై స్పందించిన ఎస్పీ చరణ్ . నాన్నగారి అభిమానులకోసం అయన స్మారకమందిరాన్ని తప్పకుండ నిర్మిస్తాము . అయన ఎంతో ఇష్టపడే అయన ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తాము . తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్నగారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తాము .
  • తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు సహకరించిన తల్లి. కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంతమొందించిన ఘటన . చేవెళ్ల‌ గుండాల గ్రామంలో ఘటన .   నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంగ అసలు విషయం బట్టబయలు . నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిష్టయ్య. తల్లితో కలసి తండ్రిని చంపేశానని ,తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించిన కొడుకు . మృతదేహం బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది. యువకుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది

చిత్రలహరి తెలుగు మూవీ రివ్యూ

Chitralahari Telugu Movie Review, చిత్రలహరి తెలుగు మూవీ రివ్యూ

టైటిల్ : చిత్రలహరి

తారాగణం : సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్, సునీల్ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిర్మాణ బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్

 

ఇంట్రడక్షన్: వరుసగా ఆరు ప్లాప్స్ తో విజయానికి దూరమైన సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్, సాంగ్స్ టీజర్స్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కథ‌ :

తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్ చూడని.. అదేంటో తెలియని యువకుడు విజయ్ కృష్ణ (సాయి తేజ్). ప్రతిభ ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి ఫెయిల్యూర్స్ విజయ్ కృష్ణను వెంటాడతాయి. ఇన్ని ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా విజయ్ కృష్ణకు వెలుగు అంటూ ఉందంటే అది లహరి (కళ్యాణి ప్రియదర్శన్) మాత్రమే. ఇక మొదట్లో ఇద్దరి మధ్య అన్ని బాగానే ఉన్నా.. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోతారు. అసలు ఆ గొడవలు ఎందుకు జరిగాయి..? ఆ గొడవలకు స్వేచ్ఛ(నివేధా పేతురాజ్) ఎందుకు కారణం అవుతుంది..? విజయ్ కృష్ణ తన జీవితంలో మరియు ప్రేమలో సక్సెస్ సాధిస్తాడా.? విజయ్ సక్సెస్ సాధించడానికి స్వేచ్ఛ ఎలా సహాయపడుతుంది.? ఇలాంటి ప్రశ్నలు తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే.

న‌టీన‌టులు :

వరుసగా ఆరు ప్లాప్స్ అందుకున్న సాయి తేజ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. జీవితంలో అన్నీ ఫెయిల్యూర్స్ ఎదుర్కునే విజయ్ కృష్ణ పాత్రలో తేజ్ చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా ప్రేక్షకులను నవ్విస్తూ.. అటు ఎమోషనల్ సీన్స్‌లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్‌తో తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్, లవ్ సీన్స్‌లో కళ్యాణి బాగా నటించింది. అలాగే మరో హీరోయిన్ నివేధా పేతురాజ్ కూడా చాలా బాగా నటించింది.

ఇక తేజ్ తండ్రి పాత్రలో పోసాని కృష్ణ మురళీ మరోసారి అలరించారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. కమెడియన్స్ వెన్నెల కిషోర్, సునీల్, హైపర్ ఆది తమ కామెడీ టైమింగ్స్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించారు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

విశ్లేష‌ణ‌ :

దర్శకుడు కిషోర్ తిరుమల మంచి స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ దానిని ఆకట్టుకునే విధంగా చూపించడంలో విఫలమయ్యాడు. ఇక మొదటి భాగంలో ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను చక్కగా అలరిస్తాయి.. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం అవి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ను మాత్రం మొదటి నుంచి బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా కిషోర్ తిరుమల మాటల పరంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కొన్ని చోట్ల స్లో నెరేషన్, క్లైమాక్స్ మినహా సినిమా అంతా బాగుందనే చెప్పాలి.

సాంకేతిక విభాగాల పనితీరు:

తను అనుకున్న మెయిన్ థీమ్ ను బాగా ప్రెజంట్ చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ విజువల్ పరంగా చాలా అందంగా ఉంటాయి. ఎడిటింగ్ ఓకే. ఖర్చుకు వెనకాడని మైత్రీ మూవీ మేకర్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • ప్రధాన పాత్రధారుల నటన
  • మెయిన్ పాయింట్, మాటలు
  • కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :

కొత్తదనం లేని కథ

Related Tags