Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

హార్స్ రైడింగ్‌లో మెగాస్టార్‌ను మించిన హీరోనే లేడు..!

Chiranjeevi Horse Riding in Sye Raa, హార్స్ రైడింగ్‌లో మెగాస్టార్‌ను మించిన హీరోనే లేడు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ప్రత్యేక పేజీ ఉంటుంది. అద్భుత నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఎన్నో హిట్‌లను మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆయన.. సినీ కళామతల్లి గర్వించదగ్గ హీరోగా ఖ్యాతిని ఘడించుకున్నారు. రాజకీయాల్లో చేరి టాలీవుడ్‌కు పదేళ్లు గ్యాప్ ఇచ్చినా.. ఆయన స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేదు. అంతేకాదు భవిష్యత్‌లో కూడా చిరు స్థానం అలానే ఉంటుందన్నది టాలీవుడ్‌ ఎరిగిన సత్యం. ఇక తాజాగా చిరు సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 41సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరు.. మొత్తానికి ఈ మూవీతో తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ డ్రీమ్‌ను నెరవేర్చుకోవడం కోసం చిరు చాలానే కష్టపడ్డాడు. బరువు తగ్గడం కోసం తన వయసును పట్టించుకోకుండా ఆయన స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అయ్యారు. ఏదేమైనా ఆయన ఇంత కష్టపడ్డారు కాబట్టే.. సైరా సినిమాలో ఆయన చేసిన యాక్షన్ సీన్లకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.

అయితే సైరా సినిమాలో అన్ని సన్నివేశాల్లో తనదైన నటనను కనబరిచిన చిరు.. హార్స్ రైడింగ్‌లో మరింత అదరగొట్టేశాడు. యువ హీరోలకు ధీటుగా ఆయన గుర్రపు స్వారీ చేశారు. ఇటీవల కాలంలో ప్రభాస్, రామ్ చరణ్, రానా, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు కొన్ని సినిమాల్లో హార్స్ రైడింగ్ చేయగా.. వారందరినీ మరిపిస్తూ చిరు గుర్రపు స్వారీ చేయడం విశేషం. దీంతో హార్స్ రైడింగ్‌లో చిరును మించిన హీరో లేడని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా హార్స్ రైడింగ్ ఆయనకు కొత్తేం కాదు. కొండవీటి దొంగ, బావగారు బావున్నారా, కొదమ సింహం, అల్లుడా మజాకా సహా పలు చిత్రాల్లో ఆయన హార్స్ రైడింగ్ చేశారు. ఇక రామ్ చరణ్ నటించిన బ్రూస్‌లీలో కెమెరా అప్పియరెన్స్ ఇచ్చిన ఆయన.. ఆ మూవీలోనూ చెర్రీతో పోటీ పడ్డాడు. అంతేకాదు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమయంలో 2010లో విశాఖ జిల్లాలోని పాయకరావుపేట అనే గ్రామంలోనూ ఆయన నడి వీధుల్లో హార్స్ రైడింగ్ చేసిన విషయం తెలిసిందే.