Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నిమ్మగడ్డ అంశం పై కొనసాగుతున్న ప్రభుత్వం కసరత్తు . ఇప్పటికే సుప్రీం కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం . నిమగడ్డ తనంతట తాను పునః నియమిచుకున్న సర్కులర్ ను వెనక్కు తీసుకున్న ఎస్ఈసి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

ముఖ్యమంత్రుల ముందుకు మెగాస్టార్ ప్రతిపాదన

chiranjivi on phalke award for krishna, ముఖ్యమంత్రుల ముందుకు మెగాస్టార్ ప్రతిపాదన

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ విఙ్ఞప్తిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఎలా స్పందిస్తారన్న చర్చ మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ కేంద్ర ప్రభుత్వం ముందు తెలుగు సినీ పరిశ్రమ తరపున ఓ డిమాండ్ పెట్టారు. అయితే ఆ డిమాండ్ ఢిల్లీ పెద్దలకు చేరాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాల్సిన పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు మెగాస్టార్ అభ్యర్థనను ఫార్వార్డ్ చేస్తారా అన్నదిపుడు చర్చగా మారింది.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆయన హుందాతనాన్ని చాటింది. ఎంతో కాలంగా సీనియర్ నటి విజయశాంతితో వున్న విభేదాలను రూపు మాపుకునేందుకు ట్రై చేసిన చిరంజీవి.. అదే క్రమంలో టాలీవుడ్ పెద్దగా కేంద్రానికి మరో విఙ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సాహాసాలు, ప్రయోగాలు చేసిన సీనియర్ సూపర్ స్టార్, నట శేఖర కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని చిరంజీవి సరిలేరు నీకెవ్వరు వేదిక నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

చిరంజీవి చేసిన ఈ ప్రతిపాదనకు ఎల్బీ స్టేడియంలో సభకు హాజరైన మెగాస్టార్, సూపర్ స్టార్ అభిమానులు కేరింతలతో ఆమోదం తెలిపారు. అయితే.. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై వుంది. ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరో.. లేక ఇద్దరో దీనికి అనుకూలంగా కేంద్రానికి కృష్ణ పేరును ఫాల్కే అవార్డుకు ప్రతిపాదించాల్సి వుంటుంది. అప్పుడే ఈ ప్రతిపాదనపై కేంద్రం పరిశీలన జరిపే అవకాశం వుంది.

మరి తెలుగు సీఎంలు చిరంజీవి ప్రతిపాదనను, విఙ్ఞప్తిని ఏ మేరకు పరిశీలిస్తారు? పరిశీలించి కేంద్రానికి పంపుతారు? ఈ ప్రశ్నలిపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Related Tags