చిక్కుల్లో సైరా… ఈసారి కష్టమే…!!

Sye Raa Narasimhareddy Latest Updates, చిక్కుల్లో సైరా… ఈసారి కష్టమే…!!

నిన్న వాల్మీకి, నేడు సైరా.. మెగా హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా స్టోరీ కోసం తమ దగ్గరనుంచి అన్ని ఆధారాలు తీసుకుని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 22 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించి.. సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో వీరికి న్యాయం చేస్తామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్ కోసం వారి స్థలాలను, ఆస్తులను వాడుకున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు చిత్రయూనిట్ ని కలిశామని.. చివరికి న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 5వ తరం వారసులైన దస్తగిరి రెడ్డి, లక్ష్మీ చెబుతున్నారు. చట్టపరంగా 23 మందికి రూ. 50 కోట్లు, కథ చెప్పినందుకు రూ.2 కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ తీసుకుని ఇప్పుడు చిత్రయూనిట్ మోసం చేసిందని బాధితులు వాపోతున్నారు.

ఉయ్యాలవాడ వారసుల్ని సైరా చిత్ర బృందం చీటింగ్ చేసిందని న్యాయవాది జనార్థన్ రెడ్డి టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్‌తో తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారని.. ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. ఉయ్యాలవాడ కుటుంబానికి న్యాయం చేయకపోతే.. రేపు విడుదల చేయనున్న ప్రీ రిలీజ్‌ను అడ్డుకుంటామని చెప్పారు. ఫిర్యాదుకు అన్ని ఆధారాలు సమర్పించామన్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ తమను మోసం చేశారని.. తమకు న్యాయం జరగే విధంగా చేయాలని ఉయ్యాలవాడ వారసులు టీవీ9ను ఆశ్రయించారు. రామ్ చరణే స్వయంగా తమతో మాట్లాడి నోటరీ తయారు చేయించారని.. మొత్తం 22 మందితో సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. సినిమా అయిపోయింది ఇంకేం చేయలేరని.. ఇచ్చిన హామీలు మరిచి ఇప్పుడు తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *