Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

దాసరి పాత్రలో చిరంజీవి.. మెగాస్టార్ ప్లాన్ అదుర్స్ !

chiranjeevi in dasari role, దాసరి పాత్రలో చిరంజీవి.. మెగాస్టార్ ప్లాన్ అదుర్స్ !

చిరంజీవి కొత్త పాత్ర పోషించబోతున్నారా ? పరిస్థితి.. ఆయన వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒక పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా అందరి వాడు కాస్తా కొందరివాడుగా మారిపోయిన చిరంజీవి.. మళ్ళీ అందరివాడు అనిపించుకునేందుకే ఇదంతా చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ కొందరి వాడేంటి ? అందరి వాడేంటి ? అనుకుంటున్నారా ? అయితే పూర్తిగా చదవండి..

సినీ రంగంలో ఎదురే లేని మెగాస్టార్ చిరంజీవి. ఈమాటని కాదనే వారు అత్యంత అరుదు. అలాంటి చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ తర్వాత.. పద్మభూషణ్ అవార్డు వచ్చాక సుదీర్ఘ మంతనాల తర్వాత వచ్చిన కంక్లూజన్‌కు కొనసాగింపుగా.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తిరుపతి వేదికగా బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి.. ప్రజారాజ్యం పార్టీని తెలుగు ప్రజల ముందుకు తీసుకువచ్చారు మెగాస్టార్ చిరంజీవి అనబడే కొణిదెల శివశంకర్ వరప్రసాద్.

మనందరికీ తెలిసినట్లుగానే.. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన చిరంజీవి.. రాజకీయరంగంలో మాత్రం చతికిల పడ్డారు. తానే స్వయంగా ఒక చోట గెలిచి (తిరుపతి) మరోచోట (పాలకొల్లు)లో ఓడిపోయి కన్నులొట్టబోయిన పరిస్థితిని చవి చూశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం.. కేంద్రంలో కేబినెట్ హోదాలో మంత్రి అవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రాష్ర్ట విభజన నేపథ్యంలో అటూ ఇటూ కాని నేతగా చిరంజీవి మిగిలిపోయారు. విభజనకు అనుకూలమంటే ఏపీలో.. వ్యతిరేకం అంటే తెలంగాణాలో తనను దుమ్మెత్తిపోస్తారనుకుని సైలెంటైపోయారు.

దాంతో 2014 తర్వాత చిరంజీవి రాజకీయపరంగా దాదాపు తెరమరుగైపోయారు. మెల్లిగా సినిమాల వైపు దృష్టి సారించారు. 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డితో చరిత్రలో నిలిచిపోయే సినిమాతో చెలరేగిపోయారు. ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతున్న కథే. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతే చిరంజీవి మదిలో ఏముంది ? ఎందు వరుసపెట్టి రాజకీయ నేతలతో సమావేశమవుతున్నారు ? ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఇలా రాజకీయ దిగ్గజాలను కలుస్తున్న చిరంజీవి మదిలో ఏముంది ? ఏ వ్యూహంతో మెగాస్టార్ ముందుకెళుతున్నారు ?

chiranjeevi in dasari role, దాసరి పాత్రలో చిరంజీవి.. మెగాస్టార్ ప్లాన్ అదుర్స్ !

ఈప్రశ్నలకు ఇపుడిపుడే సమాధానం దొరుకుతోంది. దాసరి నారాయణ రావు మరణం తర్వాత రెండు ఖాళీలలను చిరంజీవి పూరించబోతున్నారని టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఒకటి కాపు సామాజిక వర్గంలో దాసరి నిర్వహించిన అనుసంధాన కర్త బాధ్యతలను చిరంజీవి చేపట్టబోతున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో సినీ వర్గాల మధ్ తలెత్తే సమస్యలు, వివాదాలను పరిష్కరించడంలో అందరికన్నా ముందుండి అందరి వాడు అనిపించుకున్న దాసరి నారాయణ రావు అప్పట్లో నిర్వహించిన పాత్రను చిరంజీవి నిర్వహించాలనుకుంటున్నారని, తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దిక్కుగా మారాలని చిరంజీవి కోరుకుంటున్నారని టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

గత పది సంవత్సరాలుగా కొందరి వాడుగా మిగిలిపోయిన చిరంజీవి కాస్తా.. అందరివాడనిపించుకోవడానికి దాసరి నారాయణ రావు పాత్ర పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగానే చిరంజీవి ఈ పాత్రలోకి ఇమిడిపోతే.. టాలీవుడ్‌లో ఇబ్బందులు పడుతున్న వర్గాలకు న్యాయం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

Related Tags