Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

27ఏళ్ల తర్వాత వెండితెర‌పై క్రేజీ కాంబినేష‌న్..!

Vijayashanthi To Reunite On Screen With Chiranjeevi, 27ఏళ్ల తర్వాత వెండితెర‌పై క్రేజీ కాంబినేష‌న్..!

తెలుగు తెర‌పై చిరంజీవి, విజయశాంతి జోడీ అంటే ఓ మ్యాజిక్. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు రాగా..వాటిలో మూడు, నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ సంచ‌ల‌న విజ‌యాలుగా నిలిచాయి. ఇక వీళ్లిద్దరూ చివ‌రిసారిగా 1993లో వచ్చిన ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రంలో నటించాక మళ్లీ..జంట‌గా వెండితెర‌పై క‌నిపించ‌లేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత వీరిద్ద‌రూ సిల్వ‌ర్ స్క్రీన్ పై మెర‌వ‌బోతున్న‌ట్లు ఫిల్మ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.

ప్ర‌జంట్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించడం ఇప్పటికే క‌న్ఫామ్ అయ్యింది. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్‌ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు‌ పనులు స్టార్ట‌య్యాయి. ఇప్పుడీ మూవీలోనే విజయశాంతికి ఓ కీలక పాత్ర ఉందని స‌మాచారం. వాస్త‌వానికి ఈ పాత్రపై సోష‌ల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టబు, త్రిష, జెనీలియా తదితరుల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న చర్చల ప్రకారం దీన్ని విజయశాంతి కోసం స్పెష‌ల్ గా తీర్చిదిద్దుతోన్నట్లు తెలుస్తోంది. మరి దీంట్లో నిజ‌మెంత‌? అసలా క్యారెక్ట‌ర్ ఏంటి? ఎలా ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related Tags