మీసం మెలేయ్యడం వీరత్వం కాదంటున్న మెగాస్టార్

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణమృదంగం మోగిస్తొంది. కరోనా మహమ్మారి ముప్పు నుంచి ఇలా రక్షించుకోండి అంటూ ఓ వీడియోను రూపొందించారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాలమీదికి తెస్తుంది అని గుర్తు చేశారు....

మీసం మెలేయ్యడం వీరత్వం కాదంటున్న మెగాస్టార్
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:01 PM

సామాజిక బాధ్యతను పాటించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన బాధ్యతను నిర్వర్థించారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. రక్తదానం, నేత్రదానం లాంటివి ప్రజలకు సేవచేసే పనిలో తన ప్రత్యేకతను చాటుకుంటారు మన మెగస్టార్. సమాజానికి, దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా తన వంతు బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా తన చుట్టు ఉన్న పదిమందికి గుర్తు చేస్తుంటారు.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణమృదంగం మోగిస్తొంది. కరోనా మహమ్మారి ముప్పు నుంచి ఇలా రక్షించుకోండి అంటూ ఓ వీడియోను రూపొందించారు. చిన్న పొరపాటు కూడా ప్రాణాలమీదికి తెస్తుంది అని గుర్తు చేశారు. మీసం మెలేయ్యడం వీరత్వం కాదు.. మాస్క్ ధరించడం మన బాధ్యత అంటూ హీరో కార్తీకేయకు గుర్తు చేశారు.

`మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం` అంటూ ఓ వీడియోను మెగాస్టార్ షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించారు. `కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మీతోపాటు మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి` అంటూ చిరంజీవి ఆ వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

చిరంజీవి, కార్తీకేయ రూపొందించిన తొలి వీడియోలో.. కార్తీకేయ మాస్క్ ధరించకుండా మీసాలు దువ్వు కుంటుంటే.. చిరంజీవి మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. చిరు విసిరిన మాస్క్‌ను కార్తీకేయ అందుకొని.. మాస్క్‌పై ఉన్న మీసాలపై చేయి వేసి దువ్వుకోవడం లాంటి సీన్లతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.