శంకర్‌తో చిరు జోడీ.. నిజమేనా.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒకటి, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్… తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారట.  ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు మొదలైనట్లు సమాచారం.  తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే… తమిళంలో అజిత్ నటిస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *