‘సైరా’ నాలుగో రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ కుమ్ముడు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిరు స్టామినాను ప్రూవ్ చేసిన ఈ చిత్రం నాలుగో రోజు అదే హవాను కంటిన్య చేస్తోంది. వీకెండ్ దానికి తోడు దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సైరాకు కలెక్షన్లు ఫుల్ వస్తున్నాయి. ఇక నాలుగో రోజు సైరా […]

'సైరా' నాలుగో రోజు కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ కుమ్ముడు
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 11:36 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చిరు స్టామినాను ప్రూవ్ చేసిన ఈ చిత్రం నాలుగో రోజు అదే హవాను కంటిన్య చేస్తోంది. వీకెండ్ దానికి తోడు దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సైరాకు కలెక్షన్లు ఫుల్ వస్తున్నాయి. ఇక నాలుగో రోజు సైరా దాదాపు 14 కోట్ల షేర్‌ రాబట్టినట్టుగా ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాస్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే శనివారం 7 కోట్ల వరకు షేర్‌ వచ్చిందని వారు చెబుతున్నారు. ఇక కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సైరాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

అయితే బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. బాలీవుడ్‌లో సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. బాలీవుడ్‌ మూవీ వార్‌తో పోటి పడటం, హాలీవుడ్‌ మూవీ జోకర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో ఉత్తరాదిన సైరా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. మరోవైపు ఓవర్‌ సీస్‌ మార్క్‌ట్‌లోనూ సైరా స్టడీగా కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికాలో 1.5 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించిన సైరా.. వీకెండ్‌లో అదే జోరును కొనసాగిస్తోంది.

కాగా తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. దాదాపు 270 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఇందులో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్లు కీలక పాత్రలలో కనిపించారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు.