చిరు-మోహన్‌ బాబు ఫ్రెండ్‌షిప్‌.. అసూయగా ఉందన్న హీరో..!

టాలీవుడ్‌లో టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు. దాదాపుగా ఒకేసారి తమ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరు..

చిరు-మోహన్‌ బాబు ఫ్రెండ్‌షిప్‌.. అసూయగా ఉందన్న హీరో..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 7:31 PM

టాలీవుడ్‌లో టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు. దాదాపుగా ఒకేసారి తమ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరు.. ఇప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు చిరు సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత వీరిద్దరి మధ్య జరుగుతున్న బ్రొమాన్స్‌ను ఫ్యాన్స్‌ కూడా తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి చూస్తే తనకు అసూయగా ఉంటుందని ఆయన అన్నారు. ఇంతకు ఆయనెవరంటే.. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు.

మా నాన్న, చిరంజీవి గారి ఫ్రెండ్‌షిప్‌ను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చిన తరువాత అలా తోడుగా ఉండే స్నేహితుడిని నేను సంపాదించుకోగలనా..? అని ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటా. వారిద్దరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, సూపర్‌స్టార్‌లుగా ఎదిగారు. మాకు ఒక ఫ్లాట్‌ఫాంను ఇచ్చారు. తిట్టుకున్నా, హగ్ చేసుకున్నా.. వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కల్యాణ్‌ రామ్, ప్రభాస్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటానని అన్నారు. అలాగే నితిన్‌ తనకు మంచి ఫ్రెండ్‌ అని తెలిపారు. సుమంత్‌, గోపిచంద్‌తో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఈ మంచు హీరో.

Read This Story Also: ‘బాహుబలి’ని దాటేసిన ‘సరిలేరు’.. టాప్‌లోకి మహేష్‌ మూవీ..!