Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తిరుమల: టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్స్. టిటిడి ఉద్యోగులందరికీ స్వాబ్ టెస్టులు చేయిస్తున్నాము. తిరుమలలో ఎలాంటి ప్రత్యేక సేవ కార్యక్రమాలు ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. ఆన్ లైన్లో కల్యాణోత్సవం చేసే అంశంపై మీటింగ్ లో చర్చించాము. కల్యాణోత్సవం ఎలా చేయవచ్చు అనేదానిపై నిర్ణయం తీసుకున్నాము. త్వరలో ఆన్లైన్ కల్యాణోత్సవం తేదీ త్వరలో ప్రకటిస్తాము.

చిరంజీవికి మరో డ్రీమ్ రోల్.. ఈ సారి అది చరణ్‌ కే..!

Chiranjeevi One More Dream Role, చిరంజీవికి మరో డ్రీమ్ రోల్.. ఈ సారి అది చరణ్‌ కే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇది చిరంజీవికి డ్రీమ్ రోల్ అని చాలామంది అంటున్నా.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన డ్రీమ్ రోల్ ఇంకా మిగిలి ఉందని అంటున్నారు. మెగాస్టార్‌ చాలాకాలంగా భగత్ సింగ్ పాత్రలో నటించాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్స్‌లో బహిర్గతం చేశారు.

ఇటీవల ‘సైరా’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని’ తెలిపారు. చరణ్ తన డ్రీమ్ రోల్‌ని నెరవేర్చాడని చెప్పుకొచ్చారు. ఇక ఇదే తరుణంలో తనకు మరో డ్రీమ్ రోల్ ఉందని చెప్పారు. భగత్ సింగ్ పాత్రలో నటించాలని తనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉందని.. అయితే అలాంటి పాత్రలు చేయలేకపోవచ్చని అన్నారు. కానీ తాను చేయాలనుకున్న భగత్ సింగ్ పాత్రను రామ్ చరణ్ చేస్తే చూడాలని ఆశగా ఉందని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

మరోవైపు ‘సైరా’ సినిమా గురించి మాట్లాడితే.. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పొచ్చు. తన తండ్రి కల నెరవేర్చడానికి రామ్ చరణ్ పడిన కృషి అమోఘం. అంతేకాక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు జీవించేశారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాయి. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సైరా’తో చిరంజీవి, రామ్ చరణ్‌లు తెలుగు సినిమా ఖ్యాతి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.

Related Tags