తమిళిసైతో సైరా భేటీ.. చిరు ఆఫర్ కు గవర్నర్ ఓకే !

సైరా మూవీతో తిరుగులేని సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయోత్సవాల్లో బిజీగా వున్నారు. విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరంజీవి ఉన్నట్లుండి తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కల్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. గత కొంత కాలం చిరంజీవి బిజెపిలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో చిరంజీవి మొన్నటి దాకా తమిళనాడు బిజెపి చీఫ్ గా వ్యవహరించి తమిళి సై తో భేటీ అవడం.. సుదీర్ఘంగా ఇద్దరు సమాలోచనలు జరపడంతో మరోసారి చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టారా అన్న […]

తమిళిసైతో సైరా భేటీ.. చిరు ఆఫర్ కు గవర్నర్ ఓకే !
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 7:16 PM

సైరా మూవీతో తిరుగులేని సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి విజయోత్సవాల్లో బిజీగా వున్నారు. విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరంజీవి ఉన్నట్లుండి తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కల్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. గత కొంత కాలం చిరంజీవి బిజెపిలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో చిరంజీవి మొన్నటి దాకా తమిళనాడు బిజెపి చీఫ్ గా వ్యవహరించి తమిళి సై తో భేటీ అవడం.. సుదీర్ఘంగా ఇద్దరు సమాలోచనలు జరపడంతో మరోసారి చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టారా అన్న చర్చకు తెరలేచింది.

అయితే, గవర్నర్ తో భేటీ అయిన చిరంజీవి జాతీయ రాజకీయాలపై చర్చించారా లేక తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ పై చర్చలు జరిపారా లేక మరేదైనా అంశం ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందా అన్నదానిపై ఊహాగానాలు చెలరేగాయి. సుమారు 40 నిమిషాల పాటు చిరంజీవి, గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య చర్చకొచ్చిన అంశంపై మెగాస్టార్ అనుచరులను మీడియా మిత్రులు సంప్రదిస్తే వారు మరింత సస్పెన్స్ పెరిగేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

చిరంజీవి గవర్నర్ తో ఏం మాట్లాడారన్నది ఆయన చెబితేనే బావుంటుంది. ఇంకెవరు చెప్పినా విశ్వసించొద్దు అంటూ చిరంజీవి సన్నిహితులు చెప్పడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఎలాగైనా వివరాలు సంపాదించాలని ప్రయత్నిస్తే గానీ అసలు విషయం వెల్లడి కాలేదు.. ఇంతకీ ఏంటా మ్యాటర్ మీరే చూడండి.

చిరంజీవి నటించిన బహుభాషా చిత్రం సైరా..నరసింహారెడ్డి రిలీజ్ అయి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. స్వతహాగా తమిళురాలైన గవర్నర్ తమిళి సైని కలిసిన చిరంజీవి ఆమెకు దసరా శుభాకాంక్షలు తెలియచేయడంతోపాటు సైరా మూవీ తమిళ వెర్షన్ ను గవర్నర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని, అందుకు తప్పకుండా రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి తమిళి సై వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చిరంజీవి పాత సినిమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి పాత సినిమాలను ప్రస్తావించిన గవర్నర్ ఆయన నటనను ప్రశంసించారని సమాచారం. గవర్నర్ కోసం సైరా ప్రత్యేక ప్రదర్శన మాత్రం ఎప్పుడనేది తెలియరాలేదు.