‘లూసిఫర్’ రీమేక్ పై చిరు క్లారిటీ !

మెగాస్టార్ చిరంజీవి...తెలుగు తెరపై తిరుగులేని స్టార్. ఆయనతో సినిమా చెయ్యాలని ఎంతోమంది దర్శకులు ఆశపడుతూ ఉంటారు. కనీసం ఒక యాడ్ లో చిరుని డైరెక్ట్ చేసే అవకాశం దొరికినా, ఎంతో గొప్పగా భావిస్తారు.

‘లూసిఫర్’ రీమేక్ పై చిరు క్లారిటీ !
Follow us

|

Updated on: Sep 25, 2020 | 3:05 PM

మెగాస్టార్ చిరంజీవి…తెలుగు తెరపై తిరుగులేని స్టార్. ఆయనతో సినిమా చెయ్యాలని ఎంతోమంది దర్శకులు ఆశపడుతూ ఉంటారు. కనీసం ఒక యాడ్ లో చిరుని డైరెక్ట్ చేసే అవకాశం దొరికినా, ఎంతో గొప్పగా భావిస్తారు. కానీ ఆ అవకాశం చాలా తక్కువమందికి దొరుకుతుంది. కేవలం రెండు చిత్రాలతోనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు సుజీత్. కానీ ఊహించని విధంగా చేజారిపోయింది. ‘సాహో’ తర్వాత రామ్ చరణ్‌తో ఓ మూవీ చేసేందుకు అతను ప్రయత్నిస్తే.. ‘లూసిఫర్’ రీమేక్‌ కోసం అతణ్ని లైన్లో పెట్టేశాడు చరణ్. కొన్ని నెలల పాటు చిరు కోసం ‘లూసిఫర్’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సుజీత్ డెవలప్ చేశాడు. కానీ అతడు కథతో ఇంప్రెస్ చెయ్యకపోవడంతో, ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు వార్తలొచ్చాయి. అతని ప్లేసులో వివి వినాయక్ ను తీసుకున్నారని, అసలు ప్రాజెక్టునే కొంతకాలం పక్కన పెట్టినట్టు రూమర్స్ సర్కులేట్ అయ్యాయి.  ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఐతే సుజీత్‌ను తాము తప్పించలేదని.. అతనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని మెగాస్టార్ వెల్లడించారు.

ఈ మధ్యే సుజీత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే పెళ్లి తర్వాత తాను ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్టు మీద సరిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాడని.. తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని సుజీత్ అడిగాడని.. అందుకు తాను ఓకే చెప్పినట్లు చిరు తెలిపాడు. ప్రస్తుతం వి.వి.వినాయక్ ‘లూసిఫర్’ స్క్రిప్టు పనులను పర్యవేక్షిస్తున్నాడని.. అతనే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తాడని మెగాస్టార్ వివరించారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్‌లోనూ తాను నటిస్తున్నట్లు ధ్రువీకరించాడు చిరు.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

తాలుకు కూడా అదిరే రేటు !

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..