‘బిగ్ బి’కి మెగాస్టార్ స్పెషల్ బర్త్‌డే విష్

ఇవాళ(అక్టోబర్ 11) 78వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలీవుడ్ ‘బిగ్‌ బీ’ అమితాబ్ బచ్చన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడు, ఇండియన్‌ సినిమా బిగ్‌బీకి బర్త్ డే విషెస్‌ అని చిరు ప్రత్యేక సందేశమిచ్చారు. ఇంకా చిరు ఏమన్నారంటే.. “నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమాకు ‘బిగ్ బి’, టాలెంట్‌కి పవర్ హౌస్, నాకు ఎప్పటికీ మార్గనిర్దేశం చేసే కాంతిపుంజం, ద వన్ & ఓన్లీ అమిత్ జీ.. మీకు అద్భుతమైన పుట్టినరోజు […]

'బిగ్ బి'కి మెగాస్టార్ స్పెషల్ బర్త్‌డే  విష్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 10:37 AM

ఇవాళ(అక్టోబర్ 11) 78వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలీవుడ్ ‘బిగ్‌ బీ’ అమితాబ్ బచ్చన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అత్యంత ప్రతిభావంతుడు, ఇండియన్‌ సినిమా బిగ్‌బీకి బర్త్ డే విషెస్‌ అని చిరు ప్రత్యేక సందేశమిచ్చారు. ఇంకా చిరు ఏమన్నారంటే.. “నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమాకు ‘బిగ్ బి’, టాలెంట్‌కి పవర్ హౌస్, నాకు ఎప్పటికీ మార్గనిర్దేశం చేసే కాంతిపుంజం, ద వన్ & ఓన్లీ అమిత్ జీ.. మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు!. మీరు మీ నటనాపటిమతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉండండి.. భవిష్యత్ లోకూడా మాకు స్ఫూర్తినిస్తూ ఉండండి.!” అని మెగాస్టార్ చిరంజీవి.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కీర్తించారు.