Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లేఖ రాసిన డాక్టర్ సుధాకర్. తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన. మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్ళేందుకు అనుమతించాలని విజ్ఞప్తి.
  • ఢిల్లీ మే 31 వ తేదీ మోడీ మన్ కీ బాత్‌ కార్యక్రమం. మన్ కి బాత్ లో ...లాక్ డౌన్ 5.0 పై ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం. లాక్ డౌన్ 4.0 చివరి రోజు మే 31. పిఎం మోడీ తన ప్రసంగంలో లాక్డౌన్ స్ఫూర్తిని , దేశంలో చాలా ప్రాంతాల్లో మరింత సడలింపులు వంటి వాటి పై మాట్లాడే అవకాశం ఉందంటున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • కరోనా నుంచి కోలుకున్న ఒక నెల పసిపాప. ముంబై లోని సియాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. పసిపాప కి చప్పట్లు కొడుతూ...సెండ్ ఆఫ్ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది.
  • సినిమా షూటింగ్ లు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ యాదవ్.
  • అమరావతి: మహానాడు.. కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ గల్లా జయదేవ్.. తీర్మానాన్ని బలపరిచిన మాజీ మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ 38వ మహానాడు జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడం చూస్తే కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇకపై కరోనాకు ముందు తర్వాత అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ క్రైసిస్ లో ఇదే పెద్దది. స్పానిష్ ఫ్లూ వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ.
  • టివి9 తో రైల్వే సిపిఆర్ఓ రాకేష్: ఒకటి నుంచి ప్రయాణించే రైళ్లలో నో మాస్క్ .. నో జర్నీ. మాస్క్ లు లేకుండా స్టేషన్లకు రావొద్దు. ఒకటో తేదీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుండి 32 ట్రైన్స్ . ఢిల్లీ ,హౌరా,గుంటూరు ,వైజాగ్,బాంబే, తిరుపతి,తదితర ప్రాంతాలకు నడపనున్న రైళ్లు. ఇప్పటికే అనేక రైళ్లకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు . ప్రయాణాల్లో కోవిద్ 19 నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహరించాలి. దశల వారిగా రైళ్ల ను పెంచేందుకే ప్రయత్నిస్తున్నాం . రైల్వే బుకింగ్స్ దగ్గర నుండి రైళ్లు ఎక్కే వరకూ తిరిగి ప్రయాణికులు బయటకి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో నిబంధనలు . స్టేషన్ కి వచ్చిన ప్రయాణికుడికి థర్మల్ స్కీనింగ్ చేసిన స్టాంపింగ్ వేసి ఇళ్లకు పంపిస్తాం.

కోట్ల‌ల్లో సీసీసీ ఛారిటీ విరాళాలు..మొత్తం లెక్క‌లు చెప్పిన చిరంజీవి

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో పేద క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్‌కు చిరంజీవి స్వయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు ...
chiranjeevi announced rs 6.2 crore has been collected so far by corona crisis charity, కోట్ల‌ల్లో సీసీసీ ఛారిటీ విరాళాలు..మొత్తం లెక్క‌లు చెప్పిన చిరంజీవి
ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త్‌ను ప‌ట్టిపీడిస్తోంది మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. దీనిని నియంత్రించేందుకు యావ‌త్ భార‌తావ‌ని ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ లేని ఈ వైర‌స్ భూతాన్ని అరిక‌ట్టాలంటే సామాజిక దూరం ఒక్క‌టే మార్గం లాక్‌డౌన్. దీంతో అన్ని రంగాలు, అన్ని వ్య‌వ‌స్థ‌లు మూత‌ప‌డ్డాయి. కోవిడ్ -19 దెబ్బ‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం  సినిమా రంగం కూడా అత‌లాకుత‌లం అవుతోంది. షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేశారు. దీనికి విరాళాలు అందించాల్సిందిగా సినీ ప్రముఖులను స్వయంగా చిరంజీవి అభ్యర్థించారు.
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో పేద క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్‌కు చిరంజీవి స్వయంగా  కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆయన విజ్ఞప్తి మేరకు తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు. ఎవరి శక్తిమేర వారు విరాళాలు అందజేశారు. మార్చి 28న ఈ ఛారిటీని ఏర్పాటు చేయగా నాలుగు రోజుల్లో రూ.6.2 కోట్ల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా రూ.6.2 కోట్లు సేకరించాం. ఈ నిధికి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నా’’ అంటూ చిరంజీవి తన అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.
కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ఇచ్చినవారి వివరాలు:
–  చిరంజీవి – కోటి రూపాయలు
–  నాగార్జున – కోటి రూపాయలు
–  ప్రభాస్ – రూ.50 లక్షలు
–  రామ్ చరణ్ – రూ. 30 లక్షలు
–  నాని – రూ. 30 లక్షలు
–  ఎన్టీఆర్ – రూ. 25 లక్షలు
–  నాగచైతన్య – రూ. 25 లక్షలు
–  అల్లు అర్జున్ – రూ. 20 లక్షలు
–  వరుణ్ తేజ్ – రూ. 20 లక్షలు
–  రవితేజ – రూ. 20 లక్షలు
–  శర్వానంద్ – రూ. 15 లక్షలు
– శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
–  యూవీ క్రియేషన్స్ – రూ. 10 లక్షలు
–  సాయిధరమ్ తేజ్ – రూ. 10 లక్షలు
– విశ్వక్ సేన్ – రూ. 5 లక్షలు
– శ్రీకాంత్ – రూ. 5 లక్షలు
–  శ్రీమిత్ర చౌదరి – రూ. 5 లక్షలు
–  సుశాంత్ – రూ. 2 లక్షలు
–  కార్తికేయ – రూ. 2 లక్షలు
–  వెన్నెల కిషోర్ – రూ. 2 లక్షలు
–  సప్తగిరి – రూ. 2 లక్షలు
–  లావణ్య త్రిపాఠి – రూ. 1 లక్ష
–  సంపూర్ణేష్ బాబు – రూ. 1 లక్ష
–  బ్రహ్మాజీ – రూ. 70వేలు
అంతేకాకుండా, ఎవరైనా విరాళాలు ఇవ్వాలని భావిస్తే తమ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్ అకౌంట్‌కు పంపొచ్చన్నారు. ఈ మేరకు విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు వెల్లడించారు.
బ్యాంక్: ఐసీఐసీఐ, బంజారాహిల్స్ బ్రాంచ్, అకౌంట్ నంబర్: 0076 01 019951,
ఐఎఫ్ఎస్‌సీ కోడ్: ICIC0000076.

Related Tags