Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత. నిమ్మగడ్డ రమేశ్ ను ఈసీ గా కొనదగించాలని. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికయినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో కక్ష సాధింపు రాజకీయాలా.

చిరు మూవీలో చెర్రీనే ఫిక్స్..! హీరోయిన్లు వారేనా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాపై సస్పెన్స్‌లు ఇంకా వీడటం లేదు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట్లో రామ్‌ చరణ్‌ని అనుకున్నట్లు వార్తలు రాగా.. ఆ తరువాత మహేష్ బాబు లైన్‌లోకి వచ్చారు.
Chiranjeevi Acharya movie news, చిరు మూవీలో చెర్రీనే ఫిక్స్..! హీరోయిన్లు వారేనా..!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య సినిమాపై సస్పెన్స్‌లు ఇంకా వీడటం లేదు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మొదట్లో రామ్‌ చరణ్‌ని అనుకున్నట్లు వార్తలు రాగా.. ఆ తరువాత మహేష్ బాబు లైన్‌లోకి వచ్చారు. మెగాస్టార్‌తో కలిసి నటించేందుకు సూపర్‌స్టార్ చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో మహేష్‌కు, ఆచార్య టీమ్‌కు సరిపోలేదట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన ఔట్ అవ్వగా.. మళ్లీ చెర్రీనే ఫైనల్ చేశారట. ఈ క్రమంలో రాజమౌళిని ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా మొదట త్రిషను అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ మూవీ నుంచి ఆమె తప్పుకోవడంతో.. ఇప్పుడు ఆ పాత్ర కోసం కాజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చెర్రీ సరసన హీరోయిన్‌గా రష్మికను అనుకుంటున్నట్లు టాక్. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడగా.. ఈ లోపు హీరోయిన్లను ఫైనల్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఆ తరువాత శరవేగంగా ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇక సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read This Story Also: నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన ‘దిశ’ తండ్రి..!

Related Tags