Breaking News
  • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
  • బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో స్పష్టత. అక్టోబర్ 1 నాటికి పూర్తికానున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలన్న అంశంపై మొదలైన చర్చలు. బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాసిన ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. జేడీ(యూ) - ఎల్జేపీ మధ్య లుకలకల నేపథ్యంలో బీజేపీకి లేఖ. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే బిహార్ సీఎం నితీశ్‌పై గతంలో విమర్శలు చేసిన ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్. బీజేపీ-జేడీ(యూ)-ఎల్జేపీ మధ్య కుదరాల్సిన సీట్ల సర్దుబాటు. జేడీ(యూ) అభ్యర్థులపై పోటీకి అభ్యర్థులను నిలబెడతానని ప్రకటించిన చిరాగ్. సీట్ల సర్దుబాటులో బీజేపీ-జేడీ(యూ) మధ్య భేదాభిప్రాయాలు. తాజా చర్చలతో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అప్డేట్: శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి,సాయికృష్ణ రెడ్డి ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు. శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు.. శ్రావణి కి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలు సేకరించారు.. కస్టడీ ముగియడంతో ఈరోజు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నా పోలీసులు.
  • కరోనా బారినపడ్డ గోవా డీజీపీ ముకేశ్ కుమార్ మీనా. వెల్లడించిన గోవా ఆరోగ్య శాఖ.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.

దుబాయ్‌లో తెలంగాణవాసి కష్టాలు

బతుకు దెరువు కోసం దేశం విడిచి పోయాడు. అంతలోనే మాయదారి రోగంతో ఉన్న తావునే మరచిపోయాడు. ఇటు సొంతూరు చేరలేక అయినవారు కానరాక ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. తీరా ఓ స్వచ్చంధ సంస్థ అతన్ని గుర్తించి ఇంటి చేరుదామంటే దౌత్య నిబంధనలు అడ్డుపడుతున్నాయి. మానసికస్థితి సరిగా లేని తన భర్తను స్వదేశానికి రప్పించాలని ఆ ఇల్లాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.

chintamanpalli resident miserable condition in Dubai, దుబాయ్‌లో తెలంగాణవాసి కష్టాలు

బతుకు దెరువు కోసం దేశం విడిచి పోయాడు. అంతలోనే మాయదారి రోగంతో ఉన్న తావునే మరచిపోయాడు. ఇటు సొంతూరు చేరలేక అయినవారు కానరాక ఆ వ్యక్తి నరకయాతన అనుభవించాడు. తీరా ఓ స్వచ్చంధ సంస్థ అతన్ని గుర్తించి ఇంటి చేరుదామంటే దౌత్య నిబంధనలు అడ్డుపడుతున్నాయి. మానసికస్థితి సరిగా లేని తన భర్తను స్వదేశానికి రప్పించాలని ఆ ఇల్లాలు ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమన్‌పల్లికి చెంది న నీల ఎల్లయ్య 16 ఏండ్లు క్రితం దుబాయ్‌లో బతుకు దెరువు వెతుక్కుంటూ వెళ్లాడు. 2004లో విజిట్‌ వీసాపై దుబాయ్‌ వెళ్లిన ఈయన భవన నిర్మాణ కూలీగా పనిచేశాడు. కొంతకాలం తరువాత తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. ఇంతలో దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపే కార్యక్రమం మొదలు పెట్టారు అక్కడి అధికారులు. 2007 సంవత్సరంలో ఎల్లయ్య పాస్‌పోర్టును అక్కడి అధికారులకు అప్పగించాడు. కొన్ని నెలల తరువాత మానసికస్థితి సరిగాలేకపోవడంతో ఎల్లయ్య తాను ఉంటున్న చోటునుంచి వెళ్లిపోయాడు.

ఇదిలావుంటే, దుబాయ్‌, షార్జా ప్రాంతాల్లో కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు జైన్‌ సేవా మిషన్‌ వలంటీర్‌ రూపేష్‌మెహతా అండగా నిలిచారు. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎల్లయ్య దయనీయ స్థితిని గమనించి వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే ఇండియన్‌ కాన్సులేట్‌ ద్వారా ఎల్లయ్యకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ ఇప్పించి స్వదేశానికి పంపించడానికి రూపేష్‌మెహతా ప్రయత్నించారు. ఎల్లయ్య 16 ఏండ్ల క్రితం దుబాయ్‌లోకి ప్రవేశించిన ఎల్లయ్య పాస్‌పోర్టు వివరాలు సమర్పిస్తేనే తాత్కాలిక పాస్‌పోర్టు జారీ చేయడానికి వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎల్లయ్య దగ్గర ఏ ఆధారాలు లేకపోవడంతో ఆయన తెలంగాణలోని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ సహకారాన్ని కోరారు. గత నెల 27న ప్రవాసిమిత్ర ప్రతినిధులు ఎల్లయ్య పాస్‌పోర్టు వివరాలు అందజేయాలని కోరుతూ అతడి భార్య నీల రాజవ్వతో హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేయించారు. తన భర్త పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి వేడుకుంటోంది భార్య రాజవ్వ.
ప్రభుత్వం, అధికారులు స్పందించి తన భర్తను వెంటనే స్వదేశానికి రప్పించాలని రాజవ్వ కోరుతుంది.

Related Tags