చింతమనేని ప్రభాకర్.. మూసుకుపోతున్న పొలిటికల్ డోర్స్..!

Chintameni Prabhakar political carrer, చింతమనేని ప్రభాకర్.. మూసుకుపోతున్న పొలిటికల్ డోర్స్..!

టీడీపీ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్‌లలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఆయన దురుసు ప్రవర్తనకు ఉదాహరణలు ఎన్నో. వీఆర్వో వనజాక్షిపై చేయి చేసుకోవడం, మీడియాను భయపెట్టడం, తనకు అడ్డు చెప్పిన వారిని దూషించడం, చేయి చేసుకోవడం.. ఇలాంటి చర్యలతో తన ఖాతాలో ఏకంగా 62 కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడాయన జైలులో ఉన్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు. బెయిల్ కోసం ఆయన చేసిన విఙ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అయితే ఇంతటితో ఆయన ఎపిసోడ్ ముగియలేదు. ఇక్కడి నుంచే అసలు కథను ప్రారంభిస్తున్నారట పోలీసులు.

చింతమనేని అరెస్ట్‌ పర్వంలో తమకు అడ్డు తగిలిన వారిపైనా కేసులు బనాయించడం మొదలుపెట్టారట పోలీసులు. చింతమనేని, ఆయన గ్రూపును అన్ని విధాలుగా కట్టడి చేయాలనుకుంటున్నారు. అనుచరులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. చింతమనేనిపై ఉన్న పెండింగ్ కేసుల్లో ఒక్క కేసులోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినా.. మళ్లీ వేరే కేసుల్లో అరెస్ట్ చేయడానికి పోలీసులు పావులు కదుపుతున్నారట. అసలే ఈ సారి ఓటమి పాలవ్వడం.. టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో చింతమనేని కథ కంచికి చేరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *