Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

కరోనా కరోనా అని అరుస్తూ.. అత్యాచారయత్నం నుంచి తప్పించుకుని.. చివరకు..

Chinese woman 'pretends she has coronavirus to scare off burglar', కరోనా కరోనా అని అరుస్తూ.. అత్యాచారయత్నం నుంచి తప్పించుకుని.. చివరకు..

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి.. వందల మందిని పొట్టనపెట్టుకుంది. అయితే ఈ వ్యాధి సోకితే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. చైనా విజృంభిస్తున్న ఈ వైరస్.. ఇతర దేశాల్ని కూడా భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ అని పేరు వింటే చాలు ప్రజలు హడలిపోతున్నారు. కానీ చైనాలోని ఓ మహిళకు ఈ కరోనా పేరు కలిసొచ్చింది. ఈ పేరు చెప్పి ఓ పెద్ద ఘటన నుంచే తప్పించుకుంది. వివారాల్లోకి వెళితే.. చైనాలోని ఓ మహిళ.. ఇటీవలే వుహాన్ పట్టణం నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివాసం ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ దొంగ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్నది గమనించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ.. తాము వుహాన్ నుంచి వచ్చామని.. తనకు కరోనా సొకిందంటూ అరిచింది. తనను తాను రక్షించుకునేందుకు వూహాన్ నుంచి ఇక్కడ వచ్చి ఒంటరిగా ఉంటున్నానని సదరు దొంగొడితో చెప్పడంతో వాడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ దొంగోడు నమ్మేలా పలుమార్లు దగ్గుతున్నట్లు యాక్టింగ్ చేయడంతో.. ఆ దొంగ నిజమనే నమ్మేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోతూ ఇంట్లో ఉన్న 3800 యువాన్లను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగోడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. మొత్తానికి కరోనా వైరస్.. ఇలా కూడా ఉపయోగపడుతుందని ఈ ఇంటలిజెంట్ వుమెన్ ద్వారా తెలుస్తోంది.

Related Tags