పట్టుకున్న చైనా సైనికుడిని ఇప్పుడే వదలరట !

లడాఖ్ లోని డెమ్ చోక్ లో భారత సైన్యానికి పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ ని ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని చైనా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇతడి నుంచి అన్ని వివరాలూ తెలుసుకున్నాకే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అప్పగించనున్నారు. ఇందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. వాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న సివిల్, మిలిటరీ డాక్యుమెంట్ల లోని అంశాలను సైనికాధికారులు పరిశీలిస్తున్నారు. ఇతడిని ఛుషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ […]

పట్టుకున్న చైనా సైనికుడిని ఇప్పుడే వదలరట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 5:22 PM

లడాఖ్ లోని డెమ్ చోక్ లో భారత సైన్యానికి పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ ని ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని చైనా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇతడి నుంచి అన్ని వివరాలూ తెలుసుకున్నాకే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అప్పగించనున్నారు. ఇందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. వాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న సివిల్, మిలిటరీ డాక్యుమెంట్ల లోని అంశాలను సైనికాధికారులు పరిశీలిస్తున్నారు. ఇతడిని ఛుషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద చైనాకు అప్పగిస్తారని సైనిక వర్గాలు తెలిపాయి.