Breaking News
  • వర్షాలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తారకరామారావు సమీక్ష సమావేశం. హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు. నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని సూచన. కేవలం పది రోజుల్లోనే యాభై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలిపిన అధికారులు. భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సహాయక చర్యలు చేపడుతున్నామన్న అధికారులు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశం. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలి. పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నత అధికారులతో మంత్రి సమీక్ష.
  • అమరావతి: పుట్టా సుధాకర్ యాదవ్ ,టీటీడీ మాజీ ఛైర్మన్. డిక్లరేషన్ నిబంధనను రాజులు, బ్రిటీషు వారు కూడా గౌరవించారు. అటువంటి నిబంధన అవసరం లేదనే అధికారం టీటీడీ ఛైర్మన్ కు ఎవరిచ్చారు? ఛైర్మన్ ఇష్టానుసారం మాట్లాడుతుంటే, మిగిలిన బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదు? గతంలో తిరుమల విషయంలో అయినదానికీ, కానిదానికీ గగ్గోలు పెట్టిన స్వామీజీలు, పీఠాధిపతులు జగన్ చర్యలపై, సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు స్పందిండం లేదు? డిక్లరేషన్ లో సంతకం ఎందుకని ప్రశ్నించేవారు, అసలు స్వామివారిని దర్శించుకోకపోతే మాత్రం ఏమైంది?
  • ఘాటెక్కిన ఉల్లి. మలక్ పెట్ మార్కెట్ లో కింటా ఉల్లి ధర 5 వేలు. , కర్ణాటక, ఆంధ్రా తెలంగాణ ల్లో కురుస్తున్న వర్షాలవల్ల భారీగా దెబ్బతిన్న ఉల్లి పంట. స్టాక్ ఉన్న మహారాష్ట్ర ఉల్లికి డిమాండ్. వార్శాలు ఆగక పోతే మరింత పెరిగే అవకాశం.
  • తిరుమల: తిరుమల ఆలయ సమీపంలో రాత్రివేళ గుంపులుగా తిరుగుతున్న చిరుతలు. వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంట్లు. యానిమాల్ డిటెక్టర్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్న విజిలెన్స్ . జంతువు కెమెరాలో కనపడగానే అలారం మోగేలా ఏర్పాటు చేసిన టిటిడి విజిలెన్స్ అధికారులు. బ్రహ్మోత్సవాల వేళ అడవి జంతువుల నుంచి భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కెమెరా సైరన్ ద్వారా జంతువులను బెదరగొడుతున్న సిబ్బంది. గత మూడునెలలుగా అనేకసార్లు అలయపరిసరాల్లోకి వచ్చిన చిరుతలు, ఎలుగుబంట్లు.
  • అమరావతి: రాజధాని తరలింపుపై హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5 వరకు కొనసాగింపు. సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ హైకోర్టు న్యాయవాది. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణగా పిటిషన్. దీనిపై కౌంటర్ దాఖలుకు వారం సమయం కోరిన ప్రభుత్వం. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని నిర్ణయం. కేంద్రం అన్ని రిట్లకు సమాధానం ఇవ్వాలని కోరాం. కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారు. కేంద్రం తరపు న్యాయవాదులు అన్నిటికీ సమాధానం వేయాలంటే వేస్తామన్నారు. ఢిల్లీ న్యాయవాదులు హై బ్రిడ్ సిస్టం ద్వారా విచారణ చేయాలని కోరారు.
  • తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు. ప్రస్తుత అధ్యక్షుడిని మార్చాలంటూ సీనియర్లు బాబు కు లేఖ. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం‌ మార్పు జరగాలని చంద్రబాబును కోరిన పార్టీ నేతలు. తెలంగాణ లో పరిస్థితి పై చంద్రబాబుకు వివరించిన సీనియర్లు , కార్యకర్తలు. ఏడూ ఏళ్లుగా ఓకే అధ్యక్షునీతో పార్టీ పరిస్థితి ఆందోళనలో పడిందని తెలిపిన పార్టీ నేతలు. కింది స్థాయి కార్యకర్త నుండి పార్లమెంటు ఇంచార్జి , కోర్ కమిటీ వరకు నాయకత్వ మార్పు కోరుతూ బాబుకు డిమాండ్.
  • రంగారెడ్డి జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి కి ఫిర్యాదు చేసిన నటుడు శివ బాలాజీ దంపతులు. ఫీజు చెల్లించక పోవడంతో తన పిల్లలను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు. ఎలాంటి సమాచారం లేకుండా ఆన్లైన్ క్లాస్ నుండి తమపిల్లలను తొలగించారు : హీరో శివబాలాజీ దంపతులు . పిల్లలపై ఆన్లైన్ క్లాస్ ల పేరుతో అనేక సమస్యలు ప్రైవేటు స్కూల్స్ సృష్టిస్తున్నాయి. వేధింపులకు పాల్పడుతున్న మణికొండ లోని మౌంట్ లీటేరా జీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: హీరో శివబాలాజీ దంపతులు . 10రోజుల క్రితం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లోనూ ఫిర్యాదు చేసిన శివ బాలాజీ.
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA54,87,58043,96,39987,882
TELANGANA 1,72,6081,41,9301,042
AP 6,25,514 5,41,3195,359
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA54,87,58043,96,39987,882
TELANGANA 1,72,6081,41,9301,042
AP 6,25,514 5,41,3195,359
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్

బాలీవుడ్‌లో పెరిగిపోయిన నెపోటిజం, డ్రగ్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కంగనా రనౌత్ వాదన సమంజసమైనా ?
1683 votes · 1683 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి