భారీ మెనూతో మోదీ డిన్నర్..జిన్‌పింగ్ టేస్ట్ చేయబోతున్న వంటకాలు ఇవే..?

చెన్నై : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయనకు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యాలతో ఘనంగా భారతదేశం స్వాగతం పలికింది. జిన్‌పింగ్ కళాకారులను అత్యంత సమీపం నుంచి చూస్తూ, వారి అభినయం, ప్రదర్శనలను ఆస్వాదించారు. జిన్‌పింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఐటీసీ గ్రాండ్ చోళలో జిన్‌పింగ్‌ బస చేస్తారు. సాయంత్రం 4 […]

భారీ మెనూతో మోదీ డిన్నర్..జిన్‌పింగ్ టేస్ట్ చేయబోతున్న వంటకాలు ఇవే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 11, 2019 | 5:13 PM

చెన్నై : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం చెన్నై చేరుకున్నారు. ఆయనకు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యాలతో ఘనంగా భారతదేశం స్వాగతం పలికింది. జిన్‌పింగ్ కళాకారులను అత్యంత సమీపం నుంచి చూస్తూ, వారి అభినయం, ప్రదర్శనలను ఆస్వాదించారు.
జిన్‌పింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
సాయంత్రం నాలుగు గంటల వరకు ఐటీసీ గ్రాండ్ చోళలో జిన్‌పింగ్‌ బస చేస్తారు. సాయంత్రం 4 గంటలకు బయల్దేరి చెన్నై నుంచి 60 కి.మీ. దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం) వెళ్తారు. జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి విందు ఇస్తారు. ఈ విందులో తమిళనాడులోని చెట్టినాడ్, కరైకుడి ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతీయ వంటకాలను వడ్డిస్తారు. అంతేకాకుండా రుచికరమైన భారతీయ వంటకాలను కూడా వడ్డిస్తారు.
జిన్ పింగ్ టేస్ట్ చేయనున్న వంటకాల జాబితా: 

ఇడ్లీ.. వడ సాంబార్ పూరి ఇడియాప్పం. వడకర్రీ ఉల్లి.. క్యాలీ ఫ్లవర్ కార్న్. లివర్ ఫ్రై నూడిల్స్ వెజిేరియన్ సలాడ్.. చిరుధాన్యాలు. ఇంకా భారత దేశ వంటకాలు.. వైట్ రైస్ సాంబార్ రసం. బిర్యానీ బట్టర్ నాన్ చపాతి.. టమాటో సూప్

రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు:

చికెన్ టిక్కా సోయా మసాలా నూడిల్స్ షాంఘై నూడిల్స్ మట్టన్ ఫ్రై శీతల పానీయాలు టీ కేక్స్ పలు రకాల మిఠాయిలు..