కరోనా భయం.. చైనాలో పెంపుడు జంతువులకూ మాస్కులు !

కరోనా భయంతో చైనాలో అనేకమంది తమ పెంపుడు జంతువులకు కూడా మాస్కులు తొడుగుతున్నారు. తాము పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులకు.. ప్లాస్టిక్ బ్యాగులు, షీట్లు, పేపర్ కప్ లు, కొహెసివ్ టేపులతో ఇళ్లలో తయారు చేసిన ఫేస్ మాస్కులను, వాటి కాళ్లకు సాక్స్ ని తొడుగుతూ.. వాటిని రక్షించుకుంటున్నారు. మనుషుల నుంచి ఈ వైరస్ జంతువులకు సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. వీటి యజమానులు మాత్రం ఇలా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అనేకమంది నెటిజన్లు ఈ సరికొత్త పోకడను […]

కరోనా భయం.. చైనాలో పెంపుడు జంతువులకూ మాస్కులు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 6:23 PM

కరోనా భయంతో చైనాలో అనేకమంది తమ పెంపుడు జంతువులకు కూడా మాస్కులు తొడుగుతున్నారు. తాము పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులకు.. ప్లాస్టిక్ బ్యాగులు, షీట్లు, పేపర్ కప్ లు, కొహెసివ్ టేపులతో ఇళ్లలో తయారు చేసిన ఫేస్ మాస్కులను, వాటి కాళ్లకు సాక్స్ ని తొడుగుతూ.. వాటిని రక్షించుకుంటున్నారు. మనుషుల నుంచి ఈ వైరస్ జంతువులకు సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. వీటి యజమానులు మాత్రం ఇలా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అనేకమంది నెటిజన్లు ఈ సరికొత్త పోకడను సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ద్వారా పోస్ట్ చేస్తున్నారు.  ఈ మూగజీవాలు చూసేందుకు అనువుగా మాస్కులకు రెండు రంధ్రాలు చేయడాన్ని యజమానులు మర్చిపోలేదు. ఈ తొడుగులను వారు ‘యాంటీ కరోనా కిట్స్’ అని వ్యవహరిస్తున్నారు. కాగా-కరోనా వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1,116 మంది మృతి చెందారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తోంది. చైనాలోని కొన్ని ఆస్పత్రుల్లో కోలుకున్న కరోనా వ్యాధిగ్రస్తులను డిశ్చార్జ్ చేస్తున్నారు.