రాజాసింగ్ “చైనీస్‌ వైరస్‌” కామెంట్స్‌పై డ్రాగన్‌ గుస్సా..!

రాజాసింగ్‌.. తెలంగాణ రాష్ట్రాంలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ప్రత్యర్ధులపై ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ దాదాపుగా వివాదాస్పదంగానే ఉంటుంది. అయితే ఈయన స్టేట్మెంట్స్‌ పవర్ మొన్నటి వరకు రాష్ట్రం వరకే పరిమతమవ్వగా.. తాజాగా.. ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం, కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న దేశమైన చైనాకు కూడా ఈయన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ జ్యోతి […]

రాజాసింగ్ చైనీస్‌ వైరస్‌ కామెంట్స్‌పై డ్రాగన్‌ గుస్సా..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 8:09 PM

రాజాసింగ్‌.. తెలంగాణ రాష్ట్రాంలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ప్రత్యర్ధులపై ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ దాదాపుగా వివాదాస్పదంగానే ఉంటుంది. అయితే ఈయన స్టేట్మెంట్స్‌ పవర్ మొన్నటి వరకు రాష్ట్రం వరకే పరిమతమవ్వగా.. తాజాగా.. ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం, కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న దేశమైన చైనాకు కూడా ఈయన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ సెగ తగిలింది.

వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ‘చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో భారత్‌లోని చైనీస్‌ ఎంబసీ స్పందించింది.ఈ నేపథ్యంలో భారత్‌లోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కౌన్సిలర్‌(పార్లమెంట్‌) లియూ బింగ్‌..రాజాసింగ్‌కు లేఖ రాశారు. ‘‘కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి హెచ్చరించిన తొలిదేశం చైనా అని.. దీని అర్ధం ఈ వైరస్ చైనా నుంచి పుట్టిందని కాదని.. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే రాజాసింగ్ ఈ లేఖపై కౌంటర్‌ ఎటాక్ చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేశారని.. చైనా వైరస్ అన్నది నిజం కాదా..? అంటూ తిరిగి ప్రశ్నించారు.