పుట్టిన 30 గంటల్లోనే.. చిన్నారికి ‘కరోనా’..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. పుట్టిన 30 గంటలకే ఓ చిన్నారికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఈ చిన్నారే అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. బిడ్డకు జన్మనివ్వడానికి ముందే తల్లి సైతం కరోనా బారిన పడింది. దీన్ని వెర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో […]

పుట్టిన 30 గంటల్లోనే.. చిన్నారికి 'కరోనా'..!
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 5:43 AM

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. పుట్టిన 30 గంటలకే ఓ చిన్నారికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఈ చిన్నారే అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. బిడ్డకు జన్మనివ్వడానికి ముందే తల్లి సైతం కరోనా బారిన పడింది. దీన్ని వెర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలు తమ పుట్టబోయే పిల్లలకు సంక్రమించే అంటువ్యాధిగా వూహాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఉదహరించారు, ఇప్పటికే హార్బిన్‌ నగరంలోనూ వైరస్‌ సోకిన ఓ గర్భిణి సోమవారం బిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువుకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇప్పటివరకు వైరస్‌ ధాటికి చైనాలో దాదాపు 500 మంది మరణించారు. ఇంకా వేలాది మందికి వైరస్‌ సోకినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.