ట్రంప్‌కు లేఖ రాసిన చైనా అధ్యక్షుడు

బీజింగ్‌ : అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇరు దేశాలకు మేలు చేసేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా, అమెరికాలు మరింతగా కృషి చేస్తాయని లేఖలో ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌తో విస్తృతస్థాయి చర్చల్లో పాల్గొంటున్న చైనా ఆర్థిక నిపుణులు.. ఈ అంశంపై పురోగతి సాధించాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. గత డిసెంబర్‌ 1న జిన్‌ […]

ట్రంప్‌కు లేఖ రాసిన చైనా అధ్యక్షుడు
Follow us

|

Updated on: Feb 24, 2019 | 6:44 PM

బీజింగ్‌ : అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లేఖ రాశారు. ఇరు దేశాలకు మేలు చేసేందుకు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా, అమెరికాలు మరింతగా కృషి చేస్తాయని లేఖలో ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌తో విస్తృతస్థాయి చర్చల్లో పాల్గొంటున్న చైనా ఆర్థిక నిపుణులు.. ఈ అంశంపై పురోగతి సాధించాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. గత డిసెంబర్‌ 1న జిన్‌ పింగ్‌, ట్రంప్‌ భేటీ అయిన అనంతరం ఇరుదేశాల ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ట్రంప్‌ రాసిన లేఖతోపాటు తనకోసం తయారు చేసిన వీడియో గురించి జిన్‌పింగ్‌ లేఖలో ప్రస్తావించారు. ఇవాంకా ట్రంప్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి చైనీస్‌లో జిన్‌పింగ్‌ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన వీడియోను తాను పలుమార్లు చూసినట్లు జిన్‌పింగ్‌ తెలిపారు.