ఐరాస మండలిలో ఇండియాకు స్థానం… చైనా మౌనం

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఇండియాకు నాన్-పర్మనెంట్ స్థానం దక్కినందుకు (రెండేళ్ల పరిమిత కాలానికి)జర్మనీ, నార్వే, ఉక్రెయిన్ వంటి దేశాలు హర్షం వ్యక్తం చేయగా..

ఐరాస మండలిలో ఇండియాకు స్థానం... చైనా మౌనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 11:21 AM

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఇండియాకు నాన్-పర్మనెంట్ స్థానం దక్కినందుకు (రెండేళ్ల పరిమిత కాలానికి)జర్మనీ, నార్వే, ఉక్రెయిన్ వంటి దేశాలు హర్షం వ్యక్తం చేయగా..చైనా మాత్రం మౌనం వహించింది. తాము శాశ్వత సభ్యదేశంగా కొత్తగా ఎన్నికైన సభ్య దేశాలన్నిటితో సహకారాన్ని పెంపొందించుకుంటామని మాత్రం ముక్తసరిగా పేర్కొంది. 192 సభ్య దేశాలకు గాను భారత్.. 184 ఓట్లతో భారీ మెజారిటీని సాధించి.. మండలిలో రెండేళ్ల కాలానికి సభ్యత్వాన్ని పొందింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్.. ఇండియా ఎన్నిక గురించి ప్రస్తావించకుండా మౌనం వహించారు. ఐరాస నియమావళి ప్రకారం శాంతి, సెక్యూరిటీల పరిరక్షణలో మండలి ముఖ్య పాత్ర వహిస్తుందని ఆయన చెప్పారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యత్వం పొందేందుకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు చైనా ఎప్పటికప్పుడు అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇండియాకు మద్దతును ప్రకటించాయి. ఇలా ఉండగా… ఇండియాతో బాటు నార్వే, ఐర్లండ్, మెక్సికో దేశాలు నాన్-పర్మనెంట్ సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. వచ్ఛే ఏడాది జనవరి 1 నుంచి రెండు సంవత్సరాల పాటు ఇవి మండలి లో (నాన్) సభ్యదేశాలుగా కొనసాగుతాయి.

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.