కరోనాపై చైనా కపట నాటకం.. నిజమేనా ?

కరోనా వైరస్ గురించి చైనా కావాలనే ఇతర దేశాలకు తెలియనివ్వకుండా దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పనిగా చేస్తున్న ఆరోపణలకు ఊతంగానా అన్నట్టు ఓ కొత్త విషయం బయట పడింది..

కరోనాపై చైనా కపట నాటకం.. నిజమేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 6:06 PM

కరోనా వైరస్ గురించి చైనా కావాలనే ఇతర దేశాలకు తెలియనివ్వకుండా దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పనిగా చేస్తున్న ఆరోపణలకు ఊతంగానా అన్నట్టు ఓ కొత్త విషయం బయట పడింది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెబ్రోస్ అద్నామ్ ని వ్యక్తిగతం గా కలిసి కరోనాపై గ్లోబల్ వార్నింగ్ జారీని జాప్యం చేయాలని కోరాడట. జనవరిలోనే తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సందర్భంలో ఇలా కోరినట్టు జర్మనీ మ్యాగజైన్ ఒకటి ఈ షాకింగ్ వార్తను పబ్లిష్ చేసింది. జనవరి 21 న జిన్ పింగ్ ఆయనను కలిశాడని, కరోనా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందన్న సమాచారాన్ని తొక్కిపెట్టాలని, పైగా గ్లోబల్ ఎమర్జెన్సీ హెచ్చరికను కాస్త ఆలస్యంగా చేయాలని అభ్యర్థించాడని కోరినట్టు ఈ పత్రిక పేర్కొంది. తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తమకీ విషయం తెలిసిందని కూడా  వెల్లడించింది. అయితే ఈ వార్త ప్రచురితమైన కొన్ని గంటలకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ స్టేట్ మెంట్ ని విడుదల చేస్తూ ఇది వాస్తవ దూరమని, నిరాధారమని స్పష్టం చేసింది. జనవరి 21 న వారిద్దరూ కనీసం ఫోన్ ద్వారానైనా మాట్లాడుకోలేదని పేర్కొంది. ఈ విధమైన తప్పుడు వార్తలు తమ సంస్థ పట్ల ప్రజలకు గల విశ్వసనీయతను దెబ్బ తీస్తాయని వాపోయింది. తమకు అందిన డేటా ప్రకారం.. వూహాన్ సిటీలో ‘హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ మిషన్ ‘ జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 22 న ప్రకటించింది.

అయితే జర్మనీ పత్రిక ప్రచురించిన వార్త లోని నిజానిజాలను గట్టిగా ఖండించకుండా, ఆ దేశంలోని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఈ సమాచారం ఎలా తెలిసిందన్న ప్రశ్నలు వేయకుండా నామమాత్రంగా ఆ వార్తను ఖండించడం విడ్డూరంగా ఉంది. చైనా పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ పక్షపాతం చూపుతున్నారని ట్రంప్ అదేపనిగా ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..