చైనాలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చైనాలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు

చైనాలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 8:02 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చైనాలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తి పూర్తిగా తొలగిపోని కారణంగా ప్రేక్షకుల క్షేమం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్ల పూర్తి సామర్థ్యంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే హాల్‌లోకి అనుమతించాలని థియేటర్ల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంక్షల్లో భాగంగా.. ప్రేక్షకుల మధ్య కొన్ని సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా సూచించింది. ఇక సినిమా చూడాలనుకునే వారు ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రేక్షకులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని చైనా ప్రభుత్వం సూచించింది. కరోనా దెబ్బకు అల్లాడుతున్న సినిమా రంగాన్ని ఆదుకునేందుకే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!