మా ఆర్ధిక మూలలను దెబ్బ తీస్తున్నారు-చైనా

తమ ఆర్ధిక మూలాపై భారత్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదంటూ రాయబారి సన్ వీడాంగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు...

మా ఆర్ధిక మూలలను దెబ్బ తీస్తున్నారు-చైనా
Follow us

|

Updated on: Jul 30, 2020 | 10:51 PM

చైనా యాప్‌లపై భారత్ నిషేదం విధించిన తర్వాత తొలిసారి చైనా రాయబారి స్పందించారు. ఈ రోజు వరుస ట్వీట్లు చేశారు.  తమ ఆర్ధిక మూలాపై భారత్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదంటూ రాయబారి సన్ వీడాంగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇరు దేశాలకు నష్టం జరుగుతుదని అన్నారు. ఒకరి ఆర్ధిక వ్యవస్థలు మరొకరితో ముడిపడి ఉన్నాయని..ఒకరిని విడిచి మరో దేశం ఉండలేనంతగా బలంగా ఉన్నాయని సున్నితంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. వ్యాపార దృక్పదంలో ఆలోచించాల్సిన సమయం ఇదే అన్నారు. రెండు దేశాలకు విజయం అదించేలా ఉండాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

“మన ఆర్థిక వ్యవస్థలు చాలా పరిపూరకరమైనవి, ఒకదానితో ఒకటి ముడిపడివున్నాయి మరియు పరస్పరం ఆధారపడతాయి. బలవంతంగా డీకప్లింగ్ ధోరణికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ‘లాస్-లాస్’ ఫలితానికి మాత్రమే దారితీస్తుంది.” అని ట్వీట్‌లో హెచ్చరించే ప్రయత్నం చేశారు.