China Vaccine Capacity: షాకింగ్‌.. చైనా కరోనా టీకాపై సంచలన విషయాలు బయటపెట్టిన బ్రెజిల్‌ పరిశోధకులు

China Vaccine Capacity: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో ....

China Vaccine Capacity: షాకింగ్‌.. చైనా కరోనా టీకాపై సంచలన విషయాలు బయటపెట్టిన బ్రెజిల్‌ పరిశోధకులు
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:17 PM

China Vaccine Capacity: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంటే.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో శ్రమించాయి. ఇక వ్యాక్సిన్‌ విషయంలో చైనా టీకా సంబంధించి సమాచారం అంతా కూడా గోప్యమే. చైనా ప్రభుత్వంతో పాటు ఈ టీకాకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుతున్న దేశాలు కూడా టీకాకు సంబంధించి కీలక సమాచారం విడుదల చేయలేదు. వ్యాక్సిన్‌ సామర్థ్యం అద్భుతం అంటూ రకరకాల ప్రకటనలు తప్ప నిపుణులు కోరుతున్న కీలక వివరాలు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇది చైనా టీకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోంది.

సామర్థ్యం 50 శాతమే..

ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వరంగానికి చెందిన సినోవాక్‌ టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమేనని అక్కడి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బుటాంటన్‌‌ బమోమెడికల్‌ సెంటర్‌ నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. ఇదే సంస్థ గతంలో చైనా టీకా సామర్థ్యం ఏకంగా 70 శాతమని ప్రకటించింది. ట్రయల్స్‌కు సంబంధించిన ప్రాథమిక విశ్లేషణ అనంతరం ఈ ప్రకటన చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చైనాపై నమ్మకం పెంచుకున్నారు.

టీకా సామర్థ్యం గురించి బయటకు పొక్కడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలకు త్వరగా టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న బ్రెజిల్‌ ప్రభుత్వానికి ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది. తాజాఆ విడుదల చేసిన ఫలితాల్లో స్వల్ప తీవ్రత కలిగిన కరోనా కేసులపై జరిపిన విశ్లేషణ కూడా జోడించామని బుటాంటాన్‌ సంస్థలో క్లినికల్‌ విభాగం డైరెక్టర్ వెల్లడించారు. ఇలా విడతల వారీగా టీకా భద్రత, సామర్థ్యాలకు సంబంధించి సమాచారాన్ని విడుదల చేయడంపై బ్రెజిల్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాల అనుమతులు పొందాలంటే కరోనా టీకాకు కనీసం 50 శాతం ప్రభావశీలత కలిగి ఉండాలి. ఫైజర్‌, మోడర్నా టీకాల సామర్థ్యం 95 శాతానికి దగ్గర ఉంటే ఆక్స్‌ఫ్డ్‌ టీకా 90 శాతం వరకు ఉంది. దేశంలో టీకా ప్రక్రియ అమలు చేసేందుకు బ్రెజిల్‌ రెండు టీకాలపై ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి ఆక్సఫర్డ్‌, రెండోది చైనాకు సైనోఫార్మ్‌ కంపెనీ రూపొందించిన టీకా. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఫలితాలు బ్రెజిల్‌ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.

అయితే చైనా టీకా ప్రయోగ పరీక్షలు, కొనుగోళ్లకు సంబంధించిన డీల్స్‌ను చాలా దేశాలు రద్దు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో సివోవాక్‌ టీకా ప్రయోగ పరీక్షలకు చైనా ముందుగా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రయోగ పరీక్షలకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని బంగ్లాదేశ్‌ భరించాలంటూ ఇరకాటంలో పెట్టేసింది. దీంతో ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌ రద్దు చేసుకుంది. బ్రెజిల్‌ కూడా కొన్నాళ్లు ఈ టీకా ప్రయోగ పరీక్షలను నిలిపివేసింది.

అయితే కొత్తగా వెలువడిన డేటాతో బ్రెజిల్‌లో టీకా కార్యక్రమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బుటాంటన్‌ను ప్రభుత్వ వర్గాలు అదనపు డేటాను సమర్పించాలని ఆదేశించాయి. ఇప్పటి వరకు బ్రెజిల్‌ కేవలం చైనా టీకాతో పాటు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాపై ఆధారపడింది.

Covaxin Consent Letter: తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకా వేసుకునే వారికి అంగీకారపత్రం తప్పనిసరి: వైద్యారోగ్య శాఖ

అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు