ఉపగ్రహానికి కరోనా పుట్టిన నగరం పేరు పెట్టిన చైనా

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నవైరస్. చైనాలోని వూహాన్ నగరంలో ఈ మహమ్మారి పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నగరంలో ఆ వైరస్ ఆనవాళ్లు కూడా లేవు.అక్కడి మార్కెట్లు పాఠశాలలన్నీ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చైనా ఓ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయోగాలు స్టార్ట్ చేసింది. ఆ ఉపగ్రహానికి కరోనా పుట్టినిల్లయిన వూహాన్ పేరు పెట్టింది. ఈ నెలలోనే రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.‘ఇంటర్నెట్‌ […]

ఉపగ్రహానికి కరోనా పుట్టిన నగరం పేరు పెట్టిన చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 6:58 PM

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నవైరస్. చైనాలోని వూహాన్ నగరంలో ఈ మహమ్మారి పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నగరంలో ఆ వైరస్ ఆనవాళ్లు కూడా లేవు.అక్కడి మార్కెట్లు పాఠశాలలన్నీ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చైనా ఓ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయోగాలు స్టార్ట్ చేసింది. ఆ ఉపగ్రహానికి కరోనా పుట్టినిల్లయిన వూహాన్ పేరు పెట్టింది. ఈ నెలలోనే రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.‘ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్‌’ (ఐవోటీ) ప్రాజెక్ట్‌ కోసం ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. అయితే వూహాన్ నగరంలోనే కరోనా పుట్టడమే కాకుండా.. ఇక్కడే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ ఉపగ్రహానికి వూహాన్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.